Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఫస్ట్ పోలిటికల్ ఈవెంట్ ఇదేనేమో?

ఫస్ట్ పోలిటికల్ ఈవెంట్ ఇదేనేమో?

యాత్ర అనేది బయోపిక్ కాదని డైరక్టర్ మహీనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. అంటే మిగిలినది వైఎస్ పాదయాత్ర మాత్రమే. తెలుగులో ఇలా ఒక పొటిలిటకల్ ఈవెంట్ బేస్ చేసుకుని, కథ అల్లుకుని, దాని కోణంలోంచి  ఓ వ్యక్తి జీవితంలోకి తొంగిచూడడం అనే ఆలోచన తెరపైకి రావడం అంటే ఇదే ఫస్ట్ టైమ్ అనుకోవాలి. అసలు తెలుగులో పొలిటీషియన్ల బయోపిక్ చాలా అరుదు. గతంలో టంగుటూరు ప్రకాశం పంతులు మీద సినిమా వచ్చింది. ఆంధ్రకేసరి అంటూ.

అయితే అప్పట్లో పెద్దగా రాజకీయ చైతన్యమూ లేదు, ఈతరం జనాలకు ఆంధ్ర కేసరి మీద అంత క్రేజూ లేదు. అందువల్ల ఆ సినిమా ఇలా వచ్చి, అలా వెళ్లింది. కానీ ఇప్పటి పరిస్థితులు వేరు. ఎన్టీఆర్ అన్నా, వైఎస్ఆర్ అన్నా వర్తమాన సమాజంలో క్రేజ్ వుంది కాబట్టి ఎన్టీఆర్, యాత్ర సినిమాల మీద ఆసక్తి నెలకొంది.

అయితే ఎన్టీఆర్ సినిమాకు యాత్ర సినిమాకు చాలా తేడా వుంది. యాత్ర కేవలం ఓ ఎమోషనల్ జర్నీ. వైఎస్ అనే నాయకుడు జీవితంలో యాత్ర అనే ఘట్టం ఎలా సంభవించింది. అది ఎలా జరిగింది. దాని కారణంగా ఆయన జీవితంలో వచ్చిన మార్పు ఇవీ సూక్ష్మంగా యాత్ర సినిమాలో కనిపించేవి. ఈ తరహా సినిమాల్లో ఇదే ప్రథమం అనుకోవాలి.

వాస్తవానికి మాంచి ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు అందించాలనే ఆలోచనతో సినిమా రంగంలోకి వచ్చిన 70 ఎమ్.ఎమ్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ఇప్పటికి రెండు డిఫరెంట్ సినిమాలు అందించింది. విజయ్, శశి ఈ సంస్థ అధినేతలు భలే మంచి రోజు ఒకటి, ఆనందో బ్రహ్మ రెండు. రెండూ డిఫరెంట్ సినిమాలు అనిపించుకున్నాయి. ఇప్పుడు ఇది పూర్తిగా డిఫరెంట్ ప్రయత్నం. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే కాస్త సాహసమే.

సుమారు 25 కోట్లకు పైగా బడ్జెట్ అయిందని యూనిట్ చెబుతోంది.. డిజిటల్ రైట్స్, థియేటర్ అమ్మకాల ద్వారా దాదాపు 18 కోట్ల వరకు రికవరీ వచ్చింది. నైజాం ఏరియా నిర్మాతల చేతిలో వుంది.

ఒక భావోద్వేగాల జీవనయాత్ర అని సినిమా లవర్స్ అంతా యాత్ర సినిమాను స్వీకరిస్తారా? లేదా రాజకీయ చిత్రం అని కేవలం వైఎస్ అభిమానులు మాత్రం అక్కునపెట్టుకుంటారా అన్నది మరో రెండురోజుల్లో తెలిసిపోతుంది.

కీలకమైన 'పోల్‌ మేనేజిమెంట్‌' జగన్ ఎదుర్కోగలడా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?