Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

బయోపిక్ ఫంక్షన్ విశాఖలో

బయోపిక్ ఫంక్షన్ విశాఖలో

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 2 మహానాయుకుడు విడుదల సన్నాహాలు ప్రారంభమవుతున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగి, ఫస్ట్ కాపీ రెడీ అయితే ఈనెల 22న విడుదల సాధ్యం అవుతుంది. లేదూ టైమ్ సరిపోకపోతే సమ్మర్ విడుదల వుంటుంది. ఇదీ డిస్ట్రిబ్యూటర్ల సర్కిళ్లలో టాక్.

అయితే సినిమా రెడీ అయి, ఈ నెలలో విడుదల వుంటే ఒక ప్రీరిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫంక్షన్ ను విశాఖలో నిర్వహిస్తారు. తొలి ప్రీరిలీజ్ ఫంక్షన్ ను ఆంధ్రలో చేయాలనుకున్నారు కానీ, ఆఖరి నిమిషంలో హైదరాబాద్ లోనే నిర్వహించారు.

ఈసారి మాత్రం విశాఖలో చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బాలయ్య సన్నిహితుడు, నిర్మాతల్లో ఒకరైన సాయి కొర్రపాటి ఈ సినిమాను విశాఖ ఏరియాకు పంపిణీ చేస్తున్నారు. ఆయనే ఈసారి ప్రీరిలీజ్ ఈవెంట్ ను విశాఖలో చేద్దామని ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫంక్షన్ ఎప్పుడు అన్నది ఇంకా డిసైడ్ కాలేదు. 15 నుంచి 17 మధ్యలో వుండే అవకాశం వుంది.

కీలకమైన 'పోల్‌ మేనేజిమెంట్‌' జగన్ ఎదుర్కోగలడా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?