Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పాపం రకుల్.. చివరికి ఆ హీరోతో కూడా!

పాపం రకుల్.. చివరికి ఆ హీరోతో కూడా!

స్పైడర్ దెబ్బతో రకుల్ కు చుక్కలు కనిపించాయి. దెబ్బకు టాలీవుడ్ వదిలి వెళ్లిపోయింది. బ్యాక్ టు బ్యాక్ తమిళ్ లోనే సినిమాలు చేసింది. మళ్లీ ఎన్టీఆర్-కథానాయకుడు సినిమాలో చేసిన చిన్న పాత్రతో టాలీవుడ్ కు వచ్చింది. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది. సారీ.. డిజాస్టర్ అయి కూర్చుంది. దీంతో రకుల్ ఆశలు మరోసారి గల్లంతయ్యాయి.

అయితే రకుల్ ను ఆదుకోవడానికి ఓ హిట్ జోడీ మాత్రం ముందుకొచ్చింది. వాళ్లే బోయపాటి-బాలయ్య. రెండుసార్లు రకుల్ తో కలిసి పనిచేసిన బోయపాటి.. త్వరలో బాలయ్యతో చేయబోయే సినిమా కోసం రకుల్ ను అనుకుంటున్నాడట. స్టోరీ ఫైనలైజ్ అవ్వగానే కబురు పంపిస్తానని రకుల్ కు మాటిచ్చాడట. ఇక బాలయ్య విషయానికొస్తే ఏ హీరోయిన్ అయినా ఓకే.

అసలే బాలయ్యకు హీరోయిన్లు దొరకడం కష్టంగా మారింది. ఇలాంటి టైమ్ లో రకుల్ రూపంలో ఓ సినిమాకు హీరోయిన్ సమస్య తీరిపోయింది. కాకపోతే బాలయ్య సరసన నటించిన తర్వాత క్లిక్ అయిన హీరోయిన్లు చాలా తక్కువ. ఇక తప్పదు, బండి ఎలాగోలా లాగించాలనుకుంటేనే బాలయ్య సినిమా ఒప్పుకోవాలి.

రకుల్ ఇప్పుడు అదే పనిచేసింది. బోయపాటి చలవతో ఎలాగోలా మరో ఛాన్స్ కొట్టేసింది. బాలయ్య సినిమా కంటే ముందు నాగచైతన్యతో వెంకీమామ సినిమా చేయబోతోంది ఈ ముద్దుగుమ్మ.

కీలకమైన 'పోల్‌ మేనేజిమెంట్‌' జగన్ ఎదుర్కోగలడా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?