‘జై’తో డేటింగ్‌పై ‘తూచ్‌’ అనేసిన అంజలి

పదహారణాల తెలుగమ్మాయ్‌ అంజలి, తమిళ సినిమాలతో పాపులర్‌ అయి.. ఆ తర్వాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో తెలుగులోకి రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఇప్పుడు కూడా తమిళ సినిమాల్లోనే ఎక్కువగా కన్పిస్తూ, అడపా…

పదహారణాల తెలుగమ్మాయ్‌ అంజలి, తమిళ సినిమాలతో పాపులర్‌ అయి.. ఆ తర్వాత 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో తెలుగులోకి రీ-ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. ఇప్పుడు కూడా తమిళ సినిమాల్లోనే ఎక్కువగా కన్పిస్తూ, అడపా దడపా మాత్రమే తెలుగు సినిమాల్లో నటిస్తోన్న అంజలి, తమిళ హీరో 'జై'తో డేటింగ్‌కి సంబంధించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. 

జై – అంజలి డేటింగ్‌లో వున్నారనీ, ఇద్దరూ పెళ్ళి పీటలెక్కుతున్నారనీ గుసగుసలు విన్పిస్తున్నాయి చాన్నాళ్ళుగా. అంజలి – జై చాలా క్లోజ్‌గా వున్న ఫొటోలు సోషల్‌ మీడియాలో దర్శనమిస్తుండడం, ఇద్దరూ 'ప్రేమగా' ఒకరినొకరు వివిధ సందర్భాల్లో 'విష్‌' చేసుకుంటుండడం తెల్సిన విషయాలే. కానీ, అంజలి తాను 'జై'తో డేటింగ్‌లో లేననీ, అసలు తమ మధ్య ప్రేమ అనే మాటకు తావే లేదని తేల్చేసింది. పైగా, ఇలాంటి గాసిప్స్‌ తనను మానసికంగా ఇబ్బంది పెడుతుంటాయని అంజలి వ్యాఖ్యానించడం గమనార్హం. 

ప్రస్తుతం పూర్తిగా సినిమాల మీదనే ఫోకస్‌ పెట్టాననీ, లవ్‌ గురించి ఆలోచించేంత టైమ్‌ కూడా తనకు లేదని అంటోంది అంజలి. తమిళ సినిమాలతోపాటు తెలుగు సినిమాలతోనూ బిజీగా వున్నాననీ, ఒక్కోసారి తమిళ సినిమాల కోసం తెలుగు సినిమాల్ని, తెలుగు సినిమాల కోసం తమిళ సినిమాల్ని వదులుకోవాల్సి వస్తోందని అంజలి చెప్పుకొచ్చింది. 

అంజలి – జై మధ్య ఏమన్నా వివాదాలు తలెత్తాయా.? ఆ కారణంగానే ఇప్పుడు అంజలి 'జై'తో తాను ప్రేమలో లేనంటూ వ్యాఖ్యలు చేసిందా.? అన్న విషయమై తమిళ సినీ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కీలకమైన 'పోల్‌ మేనేజిమెంట్‌' జగన్ ఎదుర్కోగలడా?