ఈటీవీ…కాస్ట్ లీ మిస్టేక్?

కొన్ని కొన్ని విషయాల్లో పంతాలకు పోకూడదు. అందులోనూ అన్ని విధాలా బాగున్న టీమ్ ను వదులుకోకూడదు. డబుల్ మీనింగ్ లు, డైరెక్ట్ మీనింగ్ లు ఇవన్నీ ఎలా వున్నా జబర్దస్త్ షో అన్నది ఇటు…

కొన్ని కొన్ని విషయాల్లో పంతాలకు పోకూడదు. అందులోనూ అన్ని విధాలా బాగున్న టీమ్ ను వదులుకోకూడదు. డబుల్ మీనింగ్ లు, డైరెక్ట్ మీనింగ్ లు ఇవన్నీ ఎలా వున్నా జబర్దస్త్ షో అన్నది ఇటు మల్లెమాలకు, అటు ఈటీవీ కి మంచి ఆదాయ వనరు. 

అలాంటి షో విషయంలో పంతాలకు పోయి, మొత్తం పాడు చేసుకున్నట్లు కనిపిస్తోంది. రైటర్లు భరత్..నితిన్ ల దగ్గర ప్రారంభమైన బీటలు వారే వ్యవహారం దాదాపు షో మొత్తం కూలిపోయే వరకు వచ్చింది.

ఇంటర్నల్ గా ఏం జరిగిందో తెలియదు ముందుగా షో కు బ్యాక్ బోన్ గా వున్నవారు వెళ్లిపోయారు. తరువాత అగ్రిమెంట్ల వ్యవహారం మొదలైంది. నాగబాబు వెళ్లడంతోనే పెద్ద పిల్లర్ పక్కకు తప్పుకున్నట్లు అయింది. అవినాష్ విషయంలో మిగిలిన వారికి కూడా తాకడం ప్రారంభమైంది. అనుకోకుండా రోజా మంత్రిగా మారి బయటకు వెళ్లడంతో పెద్ద దెబ్బెే తగిలింది.

ఆఖరికి ఆది, సుడిగాలి సుధీర్, లేటెస్ట్ గా అనసూయ ఇలా ఒక్కొక్కరు తప్పుకుంటున్నారు. కొత్తవాళ్లని తేవడానికి కానీ ట్రయ్ చేయడానికి కానీ ఎందుకో స్పీడ్ గా వెళ్లడం లేదు. ముఖ్యంగా సరైన రైటర్లు లేని కొరత వేధిస్తున్నట్లు కనిపిస్తోంది. దాంతో అక్కడిక్కడే గుడుగుడు గుంచం తిరుగుతూ స్కిట్లు రాస్తున్నారు. అవి క్లిక్ కావడం లేదు.

మరోపక్క మా టీవీ ఒక్కొక్కరినీ లాగేస్తూ ముందుకు వెళ్లిపోతోంది. చూస్తుంటే జబర్దస్త్, దాని అనుబంధ షోలు ఇక ఎన్నాళ్లో కళకళలాడేలా కనిపించడం లేదు. మా టీవీ ఈ విషయంలో ఇప్పటికే యూ ట్యూబ్ లో హడావుడి గట్టిగా చేస్తోంది. ఫుల్ వీడియోలు పెట్టకపోవడం వల్ల జబర్దస్త్ కు ఇంకా వ్యూస్ వస్తున్నాయి అనుకోవాలి. అందరూ ఫుల్ వీడియోలు పెట్టడం మొదలుపెడితే ఇక కష్టమే.