మాంచి కాంబినేషన్ మూవీ ఒకటి వచ్చే నెల రాబోతోంది. ఓ యువ హీరో కథానాయకుడు. అభిరుచి వున్న దర్శకుడు కలిసి పని చేసారు. మంచి క్లాస్ సినిమా అవుతుందని నమ్మకం వుంది. కానీ సినిమాకు రావాల్సిన బజ్ రావడం లేదు.
అలాగే విడుదల చేసిన పాటలు జనాలకు ఎక్కలేదు. పెద్ సంగీత దర్శకుడు పని చేసారు. మంచి డైరక్టర్..పాటలు ఏంటీ ఇలా? అని అడిగితే ఇండస్ట్రీ సర్కిళ్లలో చిత్రమైన గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాకు ‘వంటగాళ్లు’ ఎక్కువయ్యారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. నిర్మాత, నిర్మాణ వ్యవహారాలు చూసిన నిర్మాత కుటుంబ సభ్యుడు, దర్శకుడు ఇలా అందరూ తలో వైపు లాగుతూ సినిమా కంప్లీట్ చేసారని గ్యాసిప్.
దర్శకుడు కు నచ్చినది, నిర్మాణ వ్యవహారాలు చూసిన వారికి నచ్చక, వాళ్లకు నచ్చింది వీళ్లకు నచ్చక, ఆఖరికి నిర్మాత కుటుంబ సభ్యుడు, నిర్మాణం అంతా అతని చేతుల్లో వుంది అని అలా ఆయన నిర్ణయాలకే వదిలేసారట.
దాంతో ఇటు ఆ నిర్మాణ నిర్వాహకుడికి, అటు దర్శకుడికి మధ్య సంగీత దర్శకుడు నలిగిపోయాడట. పదేళ్ల ఇండస్ట్రీ అని ఒకరు, అరడజను సినిమాల ఎక్స్ పీరియన్స్ ఇంకొకరు మొత్తానికి మ్యూజిక్ డైరక్టర్ తో ఆడేసుకున్నారట.