విశాఖ విఖ్యాతి పెంచే దిశగా…

విశాఖనగరానికి ప్రకృతి ప్రరమైన సొగసులు ఎన్నో ఉన్నాయి. వాటికి కాస్తా మెరుగులు దిద్దితే ప్రపంచంలోనే తిరుగులేని టూరిజం స్పాట్ అవుతుంది. ఆ దిశగా వైసీపీ సర్కార్ సమగ్రమైన కార్యాచరణకు రంగం సిద్ధం చేస్తోంది.   …

విశాఖనగరానికి ప్రకృతి ప్రరమైన సొగసులు ఎన్నో ఉన్నాయి. వాటికి కాస్తా మెరుగులు దిద్దితే ప్రపంచంలోనే తిరుగులేని టూరిజం స్పాట్ అవుతుంది. ఆ దిశగా వైసీపీ సర్కార్ సమగ్రమైన కార్యాచరణకు రంగం సిద్ధం చేస్తోంది.   

విశాఖ నగర ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే ముడసర్లోవ రిజర్వాయర్ చుట్టూ ఎనభై ఎకరాల సువిశాలమైన భూమి ఉంది. ఇపుడు ఆ భూమి మొత్తాన్ని సుందరమైన పార్కుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది. 

ఈ మేరకు పార్కుని పరిశీలించిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసియాలోనే అత్యద్భుతమైన పార్కుని ఏర్పాటు చేసేందుకు సన్నాహలు ప్రారంభించాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించారు.

ఎక్కడైనా పార్కు ఉంటే ఒకటి రెండెకరాల్లో ఉంటుంది. ఏకంగా ఎనభై ఎకరాల్లో పార్కు అంటే అది అతి పెద్ద  రికార్డే. పైగా చుట్టూ జలాశయం మధ్యన అందమైన పార్కు అంటే నిజంగా విశాఖకు మరో కలికితురాయి లాంటిదే ఈ పధకం అంటున్నారు. 

అటు రాష్త్రంలోనూ ఇటు జీవీఎంసీలోనూ వైసీపీయే అధికారంలో ఉంది కాబట్టి ఈ పధకం శరవేగంగా అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. దీనికి ఎంతదాకా నిధులు ఖర్చు అవుతాయన్నది అంచనా వేశాక పార్కు నిర్మాణానికి పునాది రాయి వేస్తారని చెబుతున్నారు.