సినిమా బ్లాక్ బస్టర్ అయితే నిర్మాతల దగ్గర నుంచో హీరోల నుంచో డైరక్టర్లకు కార్లు గిఫ్ట్ లుగా ఇవ్వడం అన్న వార్తలు కామన్ అయిపోయాయిు. కానీ వాటివెనుక తంత్రం, మంత్రం వేరుగా వుంటుంది. తరువాత సినిమాకు అడ్వాన్స్ గానో, కొంత మార్జిన్ మనీకట్టడం అలాంటివే గతంలో జరిగాయి. కానీ వార్తలు మాత్రం కారు ఫ్రీగా ఇచ్చేసారనే.
ఆ సంగతి అలావుంచితే ఎఫ్-2తో తన బ్యానర్ కు సూపర్ హిట్ ఇచ్చిన డైరక్టర్ అనిల్ రావిపూడికి నిర్మాత దిల్ రాజు బిఎమ్ డబ్ల్యు కారు గిఫ్ట్ గా ఇచ్చారని వార్తలు గుప్పుమన్నాయి. నిజానికి ఇచ్చినా తప్పులేదు. ఎందుకంటే దిల్ రాజు బ్యానర్ లోనే అతిపెద్ద హిట్.
ముఫై నుంచి ముఫై అయిదు కోట్ల లాభం ఇచ్చిన సినిమా. ఇప్పటివరకు ఇంత లాభ, ఇన్ని కలెక్షన్లు ఇచ్చిన సినిమా దిల్ రాజుకు రాలేదు. అందువల్ల గిఫ్ట్ ఇవ్వడం అన్నివిధాలా మంచిదే. కానీ, విషయం ఏమిటంటే ఇప్పటివరకు అయితే అనిల్ రావిపూడికి అలాంటి గిఫ్ ఏదీ అందలేదని, అసలు ఆ విషయమే తెలియదని విశ్వసనీయ వర్గాల బోగట్టా.
ఇలాంటి న్యూస్ ఒకటి వచ్చిందని తెలిసి అనిల్ రావిపూడి ఆశ్చర్యపోవడమే కాకుండా, నిజం అయితే బాగానే వుండు అని అనుకున్నాడట. ఇలా మరో నలుగురు రాస్తే దిల్ రాజు నిజంగా కారు ఇస్తారేమో అని అనుకుంటున్నట్లు వుంది అనిల్ రావిపూడి.
వైసీపీ వీటిని పట్టించుకోకపోవడం వారికే మేలు!
వినయ విధేయ, మజ్ను, పేటా కలిసి పోగొట్టుకున్నవే 70 కోట్లకు పైగా