విజయ్ సరసర కేథరిన్

సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ వస్తున్నా కేథరిన్ థెరిస్సాకు వున్న క్రేజ్ వేరు. లేటెస్ట్ గా ఈ అమ్మడు మరో మాంచి చాన్స్ కొట్టేసింది. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించబోతోంది. క్రాంతి…

సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తూ వస్తున్నా కేథరిన్ థెరిస్సాకు వున్న క్రేజ్ వేరు. లేటెస్ట్ గా ఈ అమ్మడు మరో మాంచి చాన్స్ కొట్టేసింది. క్రేజీ హీరో విజయ్ దేవరకొండ సరసన నటించబోతోంది. క్రాంతి మాధవ్ డైరక్షన్ లో కేఎస్ రామారావు నిర్మిస్తున్న సినిమాలో నలుగురు హీరోయిన్లు. వాళ్లలో ఓ హీరోయిన్ పాత్రకు కేథరిన్ ను తీసుకున్నారు.

ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్లుగా రాశీఖన్నా, ఐశ్వర్య రాజేష్ చేస్తున్నారు. అలాగే ఓ బాలీవుడ్ మోడల్ కమ్ నటిని కూడా తీసుకున్నారు. కేథరిన్ పోర్త్ హీరోయిన్ అన్నమాట. కెఎస్ రామారావు, వల్లభ నిర్మించే ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందిస్తున్నారు.

దసరా విడుదల టార్గెట్ గా ఈ సినిమా రెడీ అవుతోంది. కేథరిన్ ఈవారం నుంచి షూట్ కు సిద్దం అవుతున్నట్లు బోగట్టా,.

వైసీపీ వీటిని పట్టించుకోకపోవడం వారికే మేలు!

వినయ విధేయ, మజ్ను, పేటా కలిసి పోగొట్టుకున్నవే 70 కోట్లకు పైగా