24 సినిమాలు.. 31 బ్రాండ్లు: సంబర పడదామా?

తమ అభిమాన కథానాయకుడు వరుసపెట్టి సినిమాలు చేయాలని ప్రేక్షకులు కోరుకుంటారు. ఏడాదికి రెండేసి సినిమాలు చేయాలని కుదిరినప్పుడల్లా విజ్ఞప్తులు చేస్తూనే ఉంటారు. కానీ మహేష్ లాంటి హీరోలకు ఏడాదికి రెండు సినిమాలు చేయాలని ఉండదు.…

తమ అభిమాన కథానాయకుడు వరుసపెట్టి సినిమాలు చేయాలని ప్రేక్షకులు కోరుకుంటారు. ఏడాదికి రెండేసి సినిమాలు చేయాలని కుదిరినప్పుడల్లా విజ్ఞప్తులు చేస్తూనే ఉంటారు. కానీ మహేష్ లాంటి హీరోలకు ఏడాదికి రెండు సినిమాలు చేయాలని ఉండదు. ఎందుకంటే.. అదనంగా మరో సినిమా చేసే కంటే.. ఆ సమయంలో 3 యాడ్స్ చేస్తే వచ్చే మొత్తం ఎక్కువ.

ఈ విషయంలో మాత్రం మహేష్ కు అభిమానులు గుర్తురారు. ఏం చేసినా ఫ్యాన్స్ కోసమే, అభిమానుల్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే చేస్తానని చెప్పే మహేష్.. యాడ్స్ విషయంలో మాత్రం ఈ సూత్రాన్ని మరిచిపోతుంటాడు. ఇతడి సినిమాలు లేట్ అవ్వడం సర్వసాధారణం. కానీ ఇతడు చేసే యాడ్ షూటింగ్స్ మాత్రం లేట్ అవ్వవు. అంత కమిట్ మెంట్ మహేష్ ది.

ప్రస్తుతం మహేష్ కు సినిమాల కంటే వాణిజ్య ప్రకటనలతోనే ఎక్కువ డబ్బు వస్తోంది. మహేష్ లాంటి హీరో అయితే ఒక్కో బ్రాండ్ కు 20 కోట్ల రూపాయల వరకు తీసుకుంటాడనే ప్రచారం సాగుతోంది. క్రేజ్ ఉంది కాబట్టి కార్పొరేట్ సంస్థలు కూడా మహేష్ కోసమే ఎగబడుతున్నాయి. కానీ తనకు ఈ క్రేజ్ సినిమాల వల్లనే వచ్చిందనే విషయాన్ని మహేష్ మరిచిపోకూడదు.

తన కెరీర్ లో మహేష్ ఇప్పటివరకు చేసిన సినిమాలు జస్ట్ 24 మాత్రమే. అంటే ఈ 19 ఏళ్లలో 24 సినిమాలు మాత్రమే చేశాడు. అదే యాడ్స్ విషయానికొస్తే జస్ట్ ఐదేళ్లలోనే 31 యాడ్స్ చేశాడు. ఈ ఐదేళ్లలో మహేష్ చేసే సినిమాల సంఖ్య తగ్గుతూ వస్తోంది. కానీ అతడు చేసే యాడ్స్ నంబర్ మాత్రం పెరుగుతూ వస్తోంది.

ఒక ఇంటర్వ్యూలో స్వయంగా మహేష్ బాబు చెప్పినమాట ఏంటంటే.. సినిమాలతో సంబంధం లేకుండా అతడి మార్కెట్ వాల్యూ పెరుగుతోందని. మహేష్ ను యాడ్స్ చేయొద్దని ఇక్కడ ఎవరూ అనట్లేదు. క్రేజ్ ఉన్నప్పుడే క్యాష్ చేసుకోవడంలో తప్పులేదు.

కానీ వాణిజ్య ప్రకటనలపై చూపిస్తున్నంత ఆసక్తిని సినిమాలపై కూడా చూపించమని మాత్రం ఫ్యాన్స్ కోరుతున్నారు. మహేష్ ఏడాదికి 2 సినిమాలు చేస్తే చూసి సంబరపడాలని అతడి అభిమానులు, ప్రేక్షకులు తహతహలాడుతున్నారు. కానీ సినిమాల బదులు మహేష్ నుంచి యాడ్స్ మాత్రం ఏడాదికి మూడేసి వస్తున్నాయి. సంబర పడదామా?

అవకాశవాది! ప్రజలు ఏమనుకుంటారనే భయమే లేదు!

YSR యాత్ర.. కన్నీళ్లు తెప్పించే పెంచల్ దాస్ పాట