నిఖిల్.. అవసరమా ఇదంతా?

తమ పని తాము చూసుకోవడం మానేసి, అక్కర్లేని వాటిల్లో తలదూర్చినా, వేళ్లు పెట్టినా వ్యవహారం వేరుగా వుంటుంది. హీరో నిఖిల్ వ్యవహారం ఇలాగే వుంది. ముద్ర సినిమా టైటిల్ అన్నది, వేరే వాళ్లు వాళ్ల…

తమ పని తాము చూసుకోవడం మానేసి, అక్కర్లేని వాటిల్లో తలదూర్చినా, వేళ్లు పెట్టినా వ్యవహారం వేరుగా వుంటుంది. హీరో నిఖిల్ వ్యవహారం ఇలాగే వుంది. ముద్ర సినిమా టైటిల్ అన్నది, వేరే వాళ్లు వాళ్ల సినిమాలకు ముద్ర లోగోలు వాడుకోవడం అన్నది అంతా నిర్మాతకు సంబంధించిన వ్యవహారం. హీరోగా నటించే నిఖిల్ కు ఎంత నష్టమో, నిర్మాతకు అంతకన్నా ఎక్కువ నష్టం.

కానీ నిర్మాత స్పందించలేదు. హీరో నిఖిల్ మాత్రం ట్విట్టర్ లో హడావుడి చేసారు. నిజానికి సైలెంట్ గా వుంటే ఆ సినిమా ఇలా వచ్చి అలా వెళ్లిపోయేది. దాంతో అవతల నిర్మాత నట్టికుమార్ తన చిత్తానికి వచ్చినట్లు ఎటాక్ చేసారు. చానెళ్లకు పండగే పండగ.

అంతా అయిపోయింది. ఇప్పుడన్నా సైలంట్ గా వుండాలి. లేదా నిర్మాత వైపు నుంచి నరుక్కురావాలి. కానీ నిఖిల్ ఇంకా ఆ విధంగా ఆలోచించడం లేదు. మళ్లీ తానే అన్నీ పూసుకుంటున్నారు. అంతా అయిపోయింది. టైటిల్ మారుస్తున్నాం. మరో టైటిల్ చెప్పండి మళ్లీ ట్విట్టర్ లోకి వచ్చారు.

అంటే ఇప్పుడు అవతల పార్టీ చెప్పిన టైటిల్ దొంగతనం అనేమాట నిజమై కూర్చున్నట్లే కదా? పోనీ మార్చాలి అనుకున్నపుడు సైలంట్ గా మార్చేయవచ్చు కదా? మార్చేసి, ఒకేసారి అనౌన్స్ చేస్తే పోయే కదా?  అలా కాకుండా ఈ హంగామాతో మరిన్ని వార్తలకు, విశ్లేషణలకు చోటిచ్చినట్లు కాదా?

పైగా ఆ ట్వీట్ లో, నన్ను ద్వేషించిన వ్యక్తి పట్ల మరింత ప్రేమ అని చెప్పడం అంటే మరోసారి కెలకడం కాదా? తోటి హీరోలను చూసి నిఖిల్ లాంటివాళ్లు చాలా నేర్చుకోవాలి. వీలయినంతగా ప్రతి స్పందన, ఓవర్ యాక్టివ్ నెస్ తగ్గించుకోవాలి. లేదూ అంటే అసలు పనులు మానేసి ఈ కొసరు పనులు చేసుకుంటూ వుండాలి.

అసలు ముద్ర ఎప్పుడు మొదలు పెట్టారు. ఎన్నాళ్లయింది. ఎప్పుడు విడుదల. తరువాత శ్వాస సినిమా ఎప్పుడు? ఇవన్నీ సెట్ చేసుకోవాలి కానీ? అక్కర్లేని విషయాలపై దృష్టిపెట్టడం అవసరమా? నిఖిల్ ఆలోచించుకుంటే బెటర్.

అసలే టాలీవుడ్ ఇప్పుడు ఏమాత్రం సక్సెస్ లేకున్నా దర్శకులను, హీరోలను పక్కన పెడుతోంది. 2018లో కొంతమంది పక్కన వుండిపోయారు. 2019లో మరికొంత మంది పక్కన వుండిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అందువల్ల నిఖిల్ లాంటివాళ్లు చాలా జాగ్రత్తగా వుండాలి.

అవకాశవాది! ప్రజలు ఏమనుకుంటారనే భయమే లేదు!

YSR యాత్ర.. కన్నీళ్లు తెప్పించే పెంచల్ దాస్ పాట