మహేష్ సోదరి నిర్మాణంలో నాని

సాధారణంగా హీరో నాని ఒక సినిమా పూర్త్యయ్యే స్టేజ్ వుంటే తప్ప మరో సినిమా ప్రకటించరు. ప్రస్తుతం హారిక హాసిని సిస్టర్ కన్సెర్న్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో సినిమా చేస్తున్నారు. ఆ…

సాధారణంగా హీరో నాని ఒక సినిమా పూర్త్యయ్యే స్టేజ్ వుంటే తప్ప మరో సినిమా ప్రకటించరు. ప్రస్తుతం హారిక హాసిని సిస్టర్ కన్సెర్న్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో సినిమా చేస్తున్నారు. ఆ తరువాత అశ్వనీదత్ తో సినిమా స్టార్ట్ కావడానికి రెడీగా వుంది. దాని తరువాత సినిమాకే పోటీ పెరిగిపోయింది.

ఈ సినిమా మాకు అంటే మాకు అంటున్నారు పలువురు నిర్మాతలు. దిల్ రాజు-ఇంద్రగంటి కాంబినేషన్ లో నాని ఓ సినిమా చేయాల్సి వుంది. అదే విధంగా హీరో మహేష్ సోదరి మంజులకు ఓ సినిమా చేయాల్సి వుంది. మంజుల అడ్వాన్స్ లు ఇటు విక్రమ్ కుమార్ దగ్గర, మారుతి దగ్గర కూడా వున్నాయి. కానీ విక్రమ్ కుమార్ సినిమా అశ్వనీదత్ కు వెళ్లిపోయింది.

దాంతో ఇప్పుడు మారుతి కాంబినేషన్ లో మంజుల సినిమా ఒకటి లైన్ లో వుంది. ఇదిలావుంటే మారుతి ఓ సినిమాను గీతాకు చేయాల్సి వుంది. అందువల్ల గీతా-నాని కాంబినేషన్ కూడా లైన్ లో వుంది. మరి నాని ఇటు గీతా-మారుతికి చేయాలా? ఇంద్రగంటి-దిల్ రాజుకు చేయాలా? లేక మంజుల-మారుతి కాంబినేషన్ లో చేయాలా? ఇవన్నీ కూడా విక్రమ్ కుమార్ సినిమా తరువాతనే.

అందువల్ల కాస్త గ్యాప్ తీసుకుని నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. ఎవరి కథ నచ్చితే వాళ్లను బట్టి, నిర్మాతను ఫిక్స్ చేసుకునే అవకాశం వుంది అని నాని వైపు నుంచి వినవస్తున్న సంగతి. 

అవకాశవాది! ప్రజలు ఏమనుకుంటారనే భయమే లేదు!

YSR యాత్ర.. కన్నీళ్లు తెప్పించే పెంచల్ దాస్ పాట