మహేష్ ఇరవై అయిదవ చిత్రం 'మహర్షి'కి ముగ్గురు నిర్మాతలనే సంగతి తెలిసిందే. దిల్ రాజు బ్యానర్లో కన్ఫర్మ్ అయిన ఈ చిత్రం వంశీ పైడిపల్లి డేట్స్ పివిపి దగ్గర వుండడంతో లీగల్‌గా అతనూ జాయిన్ అయ్యాడు. మహేష్ ఎప్పుడో అశ్వనీదత్‌కి కమిట్ అయి వుండడం వల్ల హీరో కారణంగా ఆయనని కూడా చేర్చుకున్నారు.
అలా ముగ్గురు నిర్మాతలయిన ఈ చిత్రానికి అన్ని విషయాల్లో ఒకరితో ఒకరు సంప్రదించుకోవడం జరిగే పని కాదు. బిజినెస్ వ్యవహారాలతో పాటు మీడియా కవరేజ్‌లో దీనిని తన సినిమాగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నాడని దిల్ రాజుపై మిగిలిన ఇద్దరు నిర్మాతలు మహేష్‌కి కంప్లయింట్ చేస్తున్నారట. ముగ్గురి మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, ఈగోల కారణంగా బిజినెస్ వ్యవహారాలు కూడా ఆలస్యం అవుతున్నాయట.
దీంతో బిజినెస్‌కి సంబంధించిన విషయాలలో కూడా మహేష్ జోక్యం చేసుకోవాల్సి వస్తోందని తెలిసింది. ఏప్రిల్ 5న విడుదల చేయాలని ప్లాన్ చేసిన ఈ చిత్రం ఏప్రిల్ 25కి వెళ్లడం కూడా ప్లానింగ్ పరంగా జరిగిన లోపాల కారణంగానేనట.
సమ్మర్‌ని క్యాష్ చేసుకోవడానికి వున్న మంచి అవకాశాన్ని మిస్ చేసారని ఫాన్స్ ఆల్రెడీ ఫైర్ అవుతున్నారు. సమ్మర్లో మొదట రిలీజ్ అయ్యే భారీ చిత్రానికి చాలా బోనస్‌లుంటాయి. గత యేడాది రంగస్థలంనే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ముగ్గురు నిర్మాతలు, ముగ్గురూ హేమాహేమీలు కావడం 'మహర్షి'కి అక్కర్లేని తలనొప్పులు తెస్తోందన్నమాట.