అదియును..ఆర్థికప్రయోజనం తప్ప..

మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మిగిలిన వ్యవహారాల సంగతి ఎలా వున్నా, ముక్కు పిండి మరీ పన్నులు వసూలు చేయడం, కచ్చితంగా పన్ను కట్టే మధ్యతరగతికి ఒక్కశాతం కూడా వెసులుబాటు ఇవ్వకపోవడం, జిఎస్టీ…

మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మిగిలిన వ్యవహారాల సంగతి ఎలా వున్నా, ముక్కు పిండి మరీ పన్నులు వసూలు చేయడం, కచ్చితంగా పన్ను కట్టే మధ్యతరగతికి ఒక్కశాతం కూడా వెసులుబాటు ఇవ్వకపోవడం, జిఎస్టీ పేరుతో మొత్తం కేంద్రమే వసూలు చేసి, రాష్ట్రాలకు విదల్చడానికి సవాలక్ష నిబంధనలు పెట్టడం లాంటి వ్యవహారాలు బోలెడు వున్నాయి. ఈ ఏడాది బడ్జెట్ లో కూడా ఆదాయపన్ను వెసులు బాటు అంటూ ఓ కొత్త ఫార్ములా తయారుచేసి, ఏ మాత్రం ఉపయోగం లేని విధంగా చేసారు. మోడీ హయాంలో రాష్ట్రాలే కాదు, మధ్యతరగతి జనాలు కూడా ఆర్థిక ప్రయోజనం ఆశించడం అన్నది అడియాసే. 

రాష్ట్రాల వరకు ఆర్థిక క్రమశిక్షణ కోసం నిబంధనలు కఠినంగా పెట్టడం వరకు ఓకె. డబ్బున్న మారాజులు రుణాలు తీసేసుకుని ఎగ్గొడితే, జనాల నుంచి వసూలు చేసిన పన్నుల మొత్తం నుంచి బ్యాంకులకు సర్దుబాటు చేయడం అన్నది డబుల్ ఓకె. కానీ నికార్సుగా పన్నులు కట్టే మధ్యతరగతి వేతన జీవుల సంగతి కూడా పట్టించుకోవాలి కదా?

కరోనా నేపథ్యంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది. చాల మంది ఉపాథి లేక అల్లల్లాడుతున్నారు. అమెరికాలో ఒక స్థాయి దిగువన వున్నవారికి ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇటలీలో పలు ఆర్థిక వెసులుబాట్లు ప్రకటించారు. ముఖ్యంగా ఆదాయపన్ను రాయతీ, వివిధ రుణాల వాయిదాల చెల్లింపు వాయిదా ఇలాంటివి ప్రకటిస్తున్నారు.

మనదేశం వరకు వస్తే, తలుపులు వేసుకుని ఇళ్లలో కూర్చోమనడం వరకు ఓకె. అందరూ ఇళ్లలో చేరి తప్పట్లు కొట్టండి, చప్పుడు చేయండి లాంటి సెంటిమెంట్ అస్త్రాలు వాడుతున్నారు. పైగా ఆ సామూహిక సౌండ్ కి భయపడి వైరస్ పారిపోతుందని వాట్సప్ ప్రచారం ఒకటి. 

మన దగ్గర ఇప్పుడు చాలా మందికి జీతాలు వచ్చే పరిస్థితి లేదు. చాలా మందికి వేతనాల్లో కోతపడే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా సంస్థలు ప్రొడక్షన్ తగ్గించుకునే ఆలోచనలో వున్నాయి. ఈ దేశంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కరోనా బాధితుడు కానివారు లేరు. ఇలాంటి టైమ్ లో కూడా మోడీ ప్రభుత్వం మద్యతరగతి జనాలను ఆదుకోవాల్సి వుంది.

అమ్మఒడి, రైతు బంధు, ఈ స్కీము, ఆ స్కీము అన్నీ బడుగు వర్గాలకే. నికార్సగా టాక్చ్ కట్టేవారికి ఈ దేశంలో ఏ ఉపశమనం వుండదు. ఇలాంటి టైమ్ లో ఎక్కవ ఇబ్బందికి గురయ్యేది కూడా ఈ వర్గమే. కానీ మోడీ ప్రభుత్వం మాత్రం ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు లేదు. తప్పట్లు కొట్టమంటోంది. ఖర్చులేని పనికదా.

కే ఏ పాల్ నేను సైతం

‘బిగ్‌బాస్’ ఆదేశిస్తే త‌ప్ప నోరు తెర‌వ‌రా నిమ్మ‌గ‌డ్డ‌?