విశాఖకు వరస షాకులు…?

విశాఖపట్నం అంటే సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. ఒక అందమైన గమ్యానికి విశాఖ ఎపుడూ ఘనమైన స్వాగతం పలుకుతూ ఉంటుంది అంటారు. అటువంటి విశాఖకు ఈ మధ్యన అసలు రోజులు బాగాలేవు అనుకోవాలి. Advertisement…

విశాఖపట్నం అంటే సిటీ ఆఫ్ డెస్టినీ అంటారు. ఒక అందమైన గమ్యానికి విశాఖ ఎపుడూ ఘనమైన స్వాగతం పలుకుతూ ఉంటుంది అంటారు. అటువంటి విశాఖకు ఈ మధ్యన అసలు రోజులు బాగాలేవు అనుకోవాలి.

అందమైన గులాబీకి ముళ్ళున్నట్లుగా విశాఖ సొగసు వెనక కూడా ఎన్నో ప్రమాదాలు ఉన్నాయి. విశాఖకు తూర్పు తీరంలో సముద్రం ఉంది. మూడు వంతులా కొండలు ఉన్నాయి. ఇక ప్రమాదం జరిగితే జనాలు తప్పించుకునే వీలు కూడా వీలు లేని దుస్థితి.

తాజాగా జరిగిన హెచ్పీసీఎల్ భారీ ప్రమాదం కూడా విశాఖకు షాక్ ఇచ్చేలాగే ఉంది. సమయానికి అంతా తేరుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే అతి పెద్ద నష్టమే జరిగేది అంటున్నారు. ఇదే హెచ్ పీ సీ ఎల్ గడచిన పాతికేళ్ళుగా అనెకా ప్రమాదాలను నమోదు చేసింది. 1997లో జరిగిన ప్రమాదం చాలా పెద్దది. ఆ తరువాత కూడా అనేకం జరిగాయి. ఇందులో మెజరిటీ నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నాయని అంటున్నాయి.

ఇవన్నీ ఇలా చూస్తే సరిగ్గా మే నెలలో ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ అయిన దుర్ఘటనలో పదిహేను మంది దాకా మృతి చెందారు. అదే ఏడాది జూలై 27న ఎస్ ఎఫ్సి కంటైనర్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఇక నవంబర్ 5న స్టీల్ ప్లాంట్ లో టర్బైన్  ఆయిల్ లీక్ అయి మంటలు ఎగిసిపడ్డాయి.

ఇక 2021 వస్తూనే జనవ‌రి 27న విశాఖలోని ఒక ఆయిల్ కంపెనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఏప్రిల్ 11న దువ్వాడ సెజ్ లో మంటలు చెలరేగి అగ్ని ప్రమాదం జరిగింది. మొత్తం పాతిక నుంచి ముప్పై కిలోమీటర్ల మేర సిటీ విస్తరించింది. 

సిటీ చుట్టూ పరిశ్రమలు ఉంటే అందులో అత్యంత ప్రమాదకరమైన పరిశ్రమలు కూడా ఉన్నాయి. ఏ మూలన ఏమి జరిగినా టోటల్ గా సిటీ భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి ఉంటుంది.