ఒకప్పట్లా హీరోయిన్లు తమ ఎఫైర్లను దాచుకోవడం లేదు. తాము సింగిల్ కాదని ఘనంగా ప్రకటించుకుంటున్నారు. బాయ్ ఫ్రెండ్ తో ముద్దుముచ్చట్లను, అతడితో అనుభవాల్ని ఓపెన్ గా చెబుతున్నారు. ఇక్కడో హీరోయిన్ అదే పని చేసింది. ఆమె పేరు అవికా గౌర్.
తమ ప్రేమ విషయాన్ని గతంలోనే బయటపెట్టింది అవికా. మిలింద్ తో తను డేటింగ్ చేస్తున్న విషయాన్ని ప్రకటించింది. ఇప్పుడు తన జీవితానికి తన బాయ్ ఫ్రెండ్ ఎంత అవసరమో చెప్పుకొచ్చింది. తనలో చాలా మార్పులకు బాయ్ ఫ్రెండే కారణం అంటోంది.
“నా జీవితంలోకి మిలింద్ రావడంతో నేను మరింత కాన్ఫిడెంట్ అయ్యాను. నా సామర్థ్యం ఏంటో నాకు తెలిసింది. నేను ఏం చేయగలనో తెలిసింది. నేను ఆలోచిస్తున్న దానికంటే ఇంకా చాలా చేయగలనని తెలుసుకునేలా చేశాడు. నేను బరువు తగ్గడం నుంచి నిర్మాతగా మారడం వరకూ… నా ప్రతి అడుగులో మిళింద్ ఉన్నాడు. నా ప్రయాణంలో నాకు అండగా నిలబడ్డాడు. అతడు లేకుండా నేను ఇదంతా చేయలేను.”
ఇలా తన బాయ్ ఫ్రెండ్ ను ఆకాశానికెత్తేసింది ఈ బ్యూటీ. తెలుగులో అరకొరగా అవకాశాలు అందుకుంటున్న ఈ బ్యూటీ.. తాజాగా టెన్త్ క్లాస్ డైరీస్ అనే సినిమాలో నటించింది. ఈ సినిమా కథ మొత్తం తన చుట్టూనే తిరుగుతుందని చెప్పుకొచ్చింది అవిక.