చరణ్ ను దాటేస్తున్న వరుణ్

రామ్ చరణ్ కు వున్న చెరగని రికార్డుల్లో ఒకటి మగథీర. నైజాంలో కావచ్చు, వరల్డ్ వైడ్ గా కావచ్చు, తెలుగురాష్ట్రాల్లో కావచ్చు. ఈ రికార్డును ఒక్కో హీరో దాటేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా అలా…

రామ్ చరణ్ కు వున్న చెరగని రికార్డుల్లో ఒకటి మగథీర. నైజాంలో కావచ్చు, వరల్డ్ వైడ్ గా కావచ్చు, తెలుగురాష్ట్రాల్లో కావచ్చు. ఈ రికార్డును ఒక్కో హీరో దాటేస్తున్నారు. వరల్డ్ వైడ్ గా అలా ఒక్కో సినిమా దీన్ని దాటేస్తూ వస్తుంటే, ప్రస్తుతం పదో ప్లేస్ లో వుంది. కానీ వరుణ్ తేజ్ ఎఫ్ 2 సినిమా ఆ ప్లేస్ ఆక్రమించబోతోంది.

వరల్డ్ వైడ్ 73 కోట్లకు కాస్త అటుగా మగధీర కలెక్షన్లు వున్నాయి. ఇప్పుడు ఆ రికార్డుకు చేరువగా వుంది ఎఫ్ 2. ఈ వీకెండ్ తో దాటేస్తుంది. అప్పుడు ఇక మగధీర టాప్ టెన్ లో వుండదు. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా మగధీర 61 కోట్లకు కాస్త అటుగా కలెక్షన్లతో ఏడో స్థానంలో వుంది. ఇప్పుడు ఇక్కడ కూడా కిందకు జారి ఎనిమిదో ప్లేస్ కు వచ్చేస్తుంది.

ఇక నైజాంలో కూడా దాటేసే అవకాశం కనిపిస్తోంది. ఉత్తరాంధ్రలో అయితే ఏకంగా టాప్ 5లోకే వచ్చేలా వుంది. అప్పుడు ఇక మహేష్ కు కూడా అక్కడ టాప్ ఫైవ్ లో ప్లేస్ వుండదు. కేవలం చరణ్ కు, మెగాస్టార్ కు, ప్రభాస్ కు మాత్రమే అక్కడ టాప్ ఫైవ్ లో ప్లేస్ వుంటుంది.

ఈవారం కూడా సరైన సినిమా లేదు. అందువల్ల ఈ వీకెండ్ లో కూడా ఎఫ్ 2 దే హవా. 

జగన్ కు మంత్రుల లేఖలు- టిడిపి సెల్ప్ గోల్ అవుతుందా

YSR యాత్ర.. కన్నీళ్లు తెప్పించే పెంచల్ దాస్ పాట