టాలీవుడ్ లో దిల్ రాజు స్టార్ ప్రొడ్యూసర్. మరి కోలీవుడ్ లో దిల్ రాజు పరిస్థితేంటి. ఒక్క సినిమా కూడా చేయలేకపోయాడు. కమల్ హాసన్ తో ఇండియన్-2 ఎనౌన్స్ చేసి మరీ డ్రాప్ అయ్యాడు. ఇప్పుడీ నిర్మాత ఏకంగా బాలీవుడ్ పై కన్నేశాడు. ఇతడికి ఇంత ఉత్సాహాన్నిచ్చిన ఆ సినిమా ఎఫ్2.
అవును.. ఎఫ్2 సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టాలని భావిస్తున్నాడు దిల్ రాజు. ఈ మేరకు ఇప్పటికే అక్కడ రంగం సిద్ధంచేశాడు. ముంబయిలో ఎఫ్2 ప్రీమియర్స్ ఏర్పాటుచేసి, దానికి తమన్నాను కో-ఆర్డినేటర్ గా పెట్టాడు. ఇప్పటికే పలువురు ప్రముఖులు ముంబయిలో ఎఫ్2 సినిమా చూశారు.
అయితే ఎఫ్2 హిందీ రీమేక్ తో డైరక్ట్ గా బాలీవుడ్ లోకి ఎంటరవ్వాలని అనుకోవడం లేదు దిల్ రాజు. ఎవరైనా హిందీ ప్రొడ్యూసర్ కు ఈ సినిమా నచ్చితే, రీమేక్ రైట్స్ అతడికి ఇచ్చేసి, తను సహ-నిర్మాతగా వ్యవహరిస్తూ ఎఫ్2ను హిందీలో నిర్మించాలనేది దిల్ రాజు ప్లాన్. అలా నెమ్మదిగా బాలీవుడ్ లో అడుగుపెట్టాలనేది ఈ నిర్మాత ఆలోచన.
హిందీలో కూడా హిట్టయ్యే లక్షణాలు ఎఫ్2లో పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఇదేతరహా కథలతో వచ్చిన ఎన్నో హిందీ సినిమాలు బాలీవుడ్ లో హిట్టయ్యాయి. సో.. రోహిత్ షెట్టి లాంటి మంచి దర్శకుడి చేతిలో ఈ రీమేక్ పడితే బాలీవుడ్ లో కూడా ఎఫ్2 దుమ్ముదులపడం ఖాయం.