అమెరికాలో తెలుగు విధ్యార్థుల అరెస్ట్‌ వెనుక

అమెరికా ప్రభుత్వమే వలస చట్టాలను ఉల్లంఘిస్తూ, ఎంఎస్‌లు చదివే వారిని పట్టుకునేందుకు అక్రమ వలసదారుల్ని గుర్తించడానికి ఇమ్మిగ్రేషన్‌ అక్రమాలు పరిశోధించేందుకు హోంల్యాండ్‌ సెక్యూరిటీ అధికారులు ఒక నకిలీ యూనివర్సిటీ ''యూనివర్సిటీ అఫ్‌ ఫార్మింగ్టన్‌'' ఏర్పాటు…

అమెరికా ప్రభుత్వమే వలస చట్టాలను ఉల్లంఘిస్తూ, ఎంఎస్‌లు చదివే వారిని పట్టుకునేందుకు అక్రమ వలసదారుల్ని గుర్తించడానికి ఇమ్మిగ్రేషన్‌ అక్రమాలు పరిశోధించేందుకు హోంల్యాండ్‌ సెక్యూరిటీ అధికారులు ఒక నకిలీ యూనివర్సిటీ ''యూనివర్సిటీ అఫ్‌ ఫార్మింగ్టన్‌'' ఏర్పాటు చేసిన స్టింగ్‌ ఆపరేషన్‌ ఫలితంగా ఈ అరెస్టులు జరిగాయి. 

1) హోంల్యాండ్‌ సెక్యూరిటీ అధికారులు లేని యూనివర్సిటీని ఉన్నట్లుచూపారు… లేని తరగతులను ఉన్నట్లు భ్రమకల్పించారు. గొప్ప ప్రెఫసర్లకు వేదికగా నమ్మబలికారు.

3) అంతే వందలమంది భారతీయ విధ్యార్థులు చేరిపోయారు. చివరకు వాళ్లు జైలుపాలయ్యారు.

4) విధ్యార్థులను వర్సిటీలకు తెచ్చే ఏజెంట్లకు ఈ వ్యూహం తెలియక ఏకంగా అంతర్గత భద్రతా ఏజన్సీలతో ఒప్పందం చేసుకున్నారు. 

5) విధ్యార్థులను చేర్పించేందుకు వారి దగ్గరే డబ్బులు తీసుకున్నారు. ఆ మధ్యవర్తులు కూడా ఎక్కువమంది భారతీయులే ఉండటం గమనార్హం.

6) అప్పటికే ఒక ఎంఎస్‌ పూర్తి అయి, ఓపీటీ లోపలే జాబ్‌రాక, దేశంలో కొనసాగాలంటే కచ్చితంగా ఏదోఒక కోర్సు వర్సిటీలో చదివితే మరింత సమయం దొరుకుతుంది అనే తపనతో చాలామంది విధ్యార్థులు.. మధ్యవర్తుల సాయంతో నకిలీ పత్రాలు సృష్టించి ఫేక్‌ వర్సిటీలో అడ్మిషన్‌ పొందారు.

7) ఈ ప్రక్రియలో భాగంగా మధ్యవర్థులు ఇటు విధ్యార్థుల నుంచి అటు అమెరికా అంతర్గత భద్రతా ఏజెన్సీల నుంచి డబ్బులు భారీగానే గుంజారు.

ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ ఈ సందర్భంగా ప్రవాసాంధ్రులు అందరినీ ఇతర దేశాల చట్టాలని తూ..చ తప్పకుండా పాటించాలని సూచించింది. మధ్యవర్తులుగా పనిచేసి విధ్యార్థులని తప్పుదోవ పట్టించడం అహేతుకమని పేర్కొంది. అదే సందర్భంలో భవిష్యత్తుని నిర్మించుకునే క్రమంలో అనేక జాగ్రత్తలు తీపుకోవాలని సూచించింది. అరెస్టు అయిన విధ్యార్థులను విడిపించేందుకు న్యాయపరమైన సహాయాన్ని అందిస్తుంది.

తక్షణం సహాయ సహకారాలు పొందేందుకు శ్రీ.సాగర్‌ డొడ్లపనేని (+1 5104091309) మరియు శ్రీమతి మేడి (+1 4324134769)ని సంప్రదించగలరు. భవిష్యత్తులో ఇటువంటివి పునరావృతం కాకుండా ఉండేందుకు ఒక ప్రత్యేక సెల్‌ని ఏపీఎన్‌ఆర్‌టీలో ఏర్పాటు చేస్తున్నారు. విదేశాలకు వెళ్లగోరుతున్న విధ్యార్థులు ఏపీఎన్‌ఆర్‌టీ కార్యలయంలోని ప్రత్యేక సెల్‌ని సంప్రదించి అవగాహన పొందినట్లయితే భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు రావని సూచించారు.
APNRT Helpline : 0863 – 2340678