ఇప్పుడు హీరోలు ఎక్కడ కథలు దొరుకుతాయా? అన్నది కీలకంగా చూస్తున్నారు. ఎందుకంటే నిర్మాతలు రెడీగా వుంటున్నారు. డైరక్టర్లు రెడీగా వుంటున్నారు. కానీ కథలే దొరకడం లేదు. అందుకే ఎక్కడో చిన్న లీడ్ దొరికితే దాన్ని పట్టుకుని డైరక్టర్ల చేతిలో పెట్టి కథలు తయారు చేయిస్తున్నారు.
నాని జెర్సీ కథను ఓ హార్ట్ టచింగ్ వీడియో ఆధారంగా తయారుచేయించినట్లు టాక్ వుంది. అలాగే ఇప్పుడు శర్వా కూడా ఓ విదేశీ సినిమాను ఎకె ఎంటర్ టైన్ మెంట్ అనిల్ సుంకర చేత కొనిపించినట్లు తెలుస్తోంది. ఈ సీడీ ఆధారంగా ఓ లవ్ స్టోరీని డెవలప్ చేయించే బాధ్యతను దర్శకుడు చందు మొండేటికి అప్పగించినట్లు తెలుస్తోంది.
కథ తయారైతే ఈ సినిమాను అనిల్ సుంకరకు లేదా సుధాకర్ చెరుకూరికి చేసే అవకాశం వుంది. మంచిదే. మరీ సినిమాలు, వీడియోలు చూసి కథలు అల్లేయకుండా, రైట్స్ కొని మరీ కథలు తయారుచేయించడం అంటే మన వాళ్లకు మంచి ఆలోచనలు వస్తున్నట్లే అనుకోవాలి. కాపీయే రైట్ అనేసుకోకుండా డబ్బులు ఖర్చుచేసి కొంటున్నారు కదా.