సోను కె టిటు కి స్వీటీ… ఈ సినిమా పేరు ఆ మధ్య తెలుగు మాధ్యమాల్లో తెగ వినిపించింది. అల్లుఅర్జున్ హీరోగా త్రివిక్రమ్ డైరక్షన్ లో ఈ సినిమా రీమేక్ చేస్తారని వార్తలు వినిపించాయి. అయితే టీసిరీస్ వాళ్లు రీమేక్ రైట్స్ ఇవ్వడానికి ఒప్పుకోలేదని, భాగస్వామ్యం అడిగారని, త్రివిక్రమ్ కూడా రీమేక్ కు అంత సుముఖత చూపించలేదని అప్పట్లో తెగ హడావుడి జరిగింది.
అయితే తివిక్రమ్ తన స్వంత సబ్జెక్ట్ తో ముందుకు వెళ్లడానికి డిసైడ్ కావడంతో ఈ విషయం మరుగునపడింది. కానీ లేటెస్ట్ విషయం వేరుగా వుంది. బన్నీ ఈ సినిమా మీద ఇప్పటికీ ఇంట్రస్ట్ గా వున్నాడట. టీసీరిస్ వాళ్లు అడిగినట్లు భాగస్వామ్యం ఇచ్చి, గీతాలో ఆ సినిమా చేయించాలని ప్లాన్ చేస్తున్నాడట.
కానీ బన్నీకి ఆ సినిమా అంతగా నప్పదు అని క్లోజ్ సర్కిళ్ల నుంచి ఫీడ్ బ్యాక్ రావడంతో, వేరే హీరోతో గీతాలో సినిమా చేయిస్తే ఎలా వుంటుందని ఆలోచిస్తున్నాడట. ఈ మేరకు ఒకరిద్దరు దర్శకులతో చర్చించినట్లు బోగట్టా. మొత్తానికి బన్నీని ఆ హిందీ సినిమా బాగానే ఆకట్టుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే తను కాకున్నా ఫర్వాలేదు, తన సంస్థలో వేరే హీరోతో అయినా ఆ సినిమా చేయించాలని చూస్తున్నాడు.
అంతేకాదు, ఆ మధ్య హిందీలో మంచి సినిమా అనిపించుకున్న అంథాదూన్ సినిమాను కూడా కొని గీతాలో రీమేక్ చేస్తే ఎలా వుంటుందన్న ఆలోచన కూడా బన్నీ చేస్తున్నట్లు వినికిడి.