బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో కదలిక వచ్చింది. దర్శకుడు త్రివిక్రమ్ స్వయంగా బన్నీని కలిసి, నెరేషన్ ఇచ్చారు. అయితే తొలిసగం మాత్రమే నెరేషన్ ఇచ్చారా? ఫుల్ నెరేషన్ ఇచ్చారా? అన్నది తెలియాల్సి వుంది. త్రివిక్రమ్ నెరేషన్ ఏ అబ్జెక్షన్స్ లేకుండా ఓకె అయినట్లు తెలుస్తోంది. తొలిసగం అయినా, పూర్తిగా అయినా నెరేషన్ ఇవ్వడం అన్నది అయిపోయింది కాబట్టి ఇక ప్రాజెక్టులో కదలిక వస్తుంది. కాస్టింగ్ వగైరా వ్యవహారాలు ముందుకు వెళ్తాయి.
ఇదిలావుంటే ఈ ప్రాజెక్టుకు సంగీత దర్శకుడిగా థమన్ కే ఎక్కువ చాన్స్ వుందని తెలుస్తోంది. ఇటీవల దేవీశ్రీప్రసాద్ వరుసగా విఫలం అవుతుండడంతో, ఈ సినిమాకు అతన్ని తీసుకునే విషయంలో త్రివిక్రమ్ ఆలోచనలో పడినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి త్రివిక్రమ్-బన్నీ-దేవీశ్రీప్రసాద్ కాంబినేషన్ లో మాంచి మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. ఆ మ్యాజిక్ రిపీట్ చేద్దామనే ఆలోచన కూడా వుంది.
కానీ దేవీ ఇటీవల పెర్ ఫార్మ్ చేస్తున్న తీరుచూసి, ముందు వెనుకలాడుతున్నారని టాక్. ప్రాజెక్టు ఫుల్ డిటెయిల్స్ ఫస్ట్ వీక్ అయ్యేసరికి బయటకు వస్తాయని తెలుస్తోంది. సైరా దసరాకు వస్తే, ఈ సినిమా సంక్రాంతికి వస్తుంది.