'మనం రైటర్స్ కు గౌరవం ఇవ్వాలి. వాల్లని గౌరవించాలి' అడియో ఫంక్షన్లలో తరచు బన్నీ చెప్పేమాట. అంతేకాదు, కాస్త మాంచిగా ఏ సినిమా పెర్ ఫార్మ్ చేసినా, ఏ వ్యక్తి చేసినా, అభినందించడం, సన్మానం చేయడం, పార్టీలుచేయడం బన్నీకి అలవాటు. పైగా గారు అనాలి. సంస్కారం అనే పెద్ద పెద్ద మాటలు చెబుతుంటారు కూడా.
కానీ పాపం, పుంభావసరస్వతి, గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి పద్మశ్రీ వస్తే ఓ ట్వీటు వేయడం కూడా మరిచాడు. స్వయంగా అభినందించడం వరకు ఎందుకు, ఓ ట్వీటు వేయడం కూడా లేదు. ఆ మాటకు వస్తే ఇండస్ట్రీ మొత్తంమీద టాప్ పర్సనాలటీల్లో కనీసం పదిశాతం మంది కూడా స్పందించి వుండరేమో?
పెద్దలలో మెగాస్టార్ చిరంజీవి ఒక్కరే కదలి వెళ్లారు. ఆ తరువాత మరికొందరు ఒకప్పటి నిర్మాతలు, దర్శకులు వెళ్లారు. ఇప్పుడు లీడ్ లో వున్నవారిలో త్రివిక్రమ్ మాత్రమే అందరికన్నా ముందుగా స్పందించారు. ఇప్పడు ఎవరు స్పందించకున్నా, స్పందించినా సిరివెన్నెలకు ఒరిగేది, పోయేదిలేదు.
కానీ టాలీవుడ్ లో సామాజిక వర్గాల తీరుతెన్నులను, అవసరార్థం పాదసేవ అనే తీరును తెలియచేస్తుందీ ఉదంతం. అంతేతప్ప మరేంకాదు. ఇదే మరే హీరోకో, దర్శకుడికో వస్తే, ఈపాటికి ఆ ఇంటకి క్యూ కట్టి వుండేవారు ఈ టాలీవుడ్ జనం.