చిత్రపురి అవక తవకలపై కమిటీ

రావణకాష్టంలా చిరకాలంగా నలుగుతున్న డైరక్టర్ల అసోసియేషన్ బోగస్ మెంబర్ షిప్ ల వ్యవహారం మరో మలుపు తిరిగింది. సినిమాలతో సంబంధంలేని 32 మందికి డైరక్టర్ల అసోసియేషన్ లో సభ్యత్వాలు ఇచ్చి, ఆ విధంగా చిత్రపురి…

రావణకాష్టంలా చిరకాలంగా నలుగుతున్న డైరక్టర్ల అసోసియేషన్ బోగస్ మెంబర్ షిప్ ల వ్యవహారం మరో మలుపు తిరిగింది. సినిమాలతో సంబంధంలేని 32 మందికి డైరక్టర్ల అసోసియేషన్ లో సభ్యత్వాలు ఇచ్చి, ఆ విధంగా చిత్రపురి కాలనీలో ఇళ్లు పొందేలా చేసారన్నది చిరకాలంగా వినిపిస్తున్న అభియోగం. దీనిపై దర్శకుడు దాసరి నారాయణరావు బతికి వుండగానే అప్పటి భోగస్ సభ్యత్వాలపై కమిటీ వేసారు.

కాదంబరి కిరణ్, సాగర్ తదితరుల టైమ్ లో జరిగాయి అనే 32మంది సభ్యత్వాలను బోగస్ గా తేల్చారు. దానిపై బాధ్యులను బాధ్యతల నుంచి తప్పించారు. ఈ ముఫై రెండు మందికి ఎన్ని నోటీస్ లు ఇచ్చినా స్ఫందన లేకపోయింది. ఆఖరికి వాటిని రద్దుచేసారు.

ఈ నేఫథ్యంలో ఆ బోగస్ సభ్యత్వాలను ఆసరాగా చేసుకుని, చిత్రపురి కాలనీలో సంపాదించిన ఇళ్లపై కూడా విచారణ జరిపించాలని, ప్రస్తుత దర్శకుల సంఘం బాధ్యులు పట్టుపట్టి పోరాడుతూ వస్తున్నారు. ఆఖరికి ఇప్పటికి ఫలితం దక్కింది.

కోపరేటివ్ హవుసింగ్ సొసైటీ కమిషనర్ ఆధ్వర్యంలోని కమిటీ విచారణ ప్రారంభించిందని డైరక్టర్స్ అసోషియన్ అధ్యక్షుడు శంకర్ తెలిపారు. ఈ విషయంపై చిరకాలంగా పోరాడుతున్నామని, ఇది ఒక విధంగా విజయం సాధించడమే అని ఆయన వివరించారు.

ఇప్పుడు ఆ 32 మందికి ఇళ్లు కనుక క్యాన్సిల్ అయితే తెరవెనుక జరిగిన అక్రమ లావాదేవీలు అన్నీ కూడా బయటకు వస్తాయి. దళారుల ద్వారా డబ్బులు తీసుకుని, 32 మందికి ఇళ్లు వచ్చేలా చేసినట్లు ఆరోపణలు వున్నాయి. అలాంటి ఇళ్లు కనుక క్యాన్సిల్ అయితే బాధితులు తమ సొమ్ము కోసం మళ్లీ అప్పట్లో డబ్బులు తీసుకున్న వారి వెంటపడే అవకాశం వుంది.

నాడు పంచెలు ఊడేలా కొట్టే కళ.. నేడు 'తాట తీయు' కళ 

పవన్ దారెటు? సతీష్ చందర్ ఈవారం టాపిక్ అఫ్ ది వీక్