రేటు తగ్గుతుందని ఆమెను తీసుకున్నారా?

ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. కానీ ఏరికోరి ఇస్మార్ట్ శంకర్ లో రామ్ సరసన నిధి అగర్వాల్ ను ఎంపిక చేశారు. ఈ మేరకు అఫీషియల్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేశారు. ఇప్పటివరకు ఒక్క…

ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు ఉన్నారు. కానీ ఏరికోరి ఇస్మార్ట్ శంకర్ లో రామ్ సరసన నిధి అగర్వాల్ ను ఎంపిక చేశారు. ఈ మేరకు అఫీషియల్ స్టేట్ మెంట్ కూడా ఇచ్చేశారు. ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా ఇవ్వని నిధిని ఆఘమేఘాల మీద ఎంపిక చేయడం చూసి అంతా ముక్కున వేలేసుకున్నారు.

నిధి అగ‌ర్వాల్ న‌టించిన మూడు సినిమాలు మున్నా మైఖేల్ (హిందీ), స‌వ్యసాచి, మిస్టర్ మ‌జ్ను.. మూడు ఢ‌మాల్‌ ఐనా ఆమెని ఏరికోరి చార్మి ఎందుకు సెల‌క్ట్ చేసింది.. అంత 'ఇస్మార్ట్ నిర్ణయం' వెనుకున్న లాజిక్ ఏంటి? త‌క్కువ పారితోషికమా?  లేక ఆమె టాలెంట్‌ని మిగ‌తా మేక‌ర్స్ స‌రిగా యూజ్ చేయ‌లేదు.. నేను చూపిస్తా అని పూరి నమ్మక‌మా?

పూరి సినిమాల్లో హీరోయిన్ల విషయంలో ఇలాంటి అనుమానాలేవీ పెట్టుకోనక్కర్లేదు. ఎందుకంటే తను నిర్మాతగా మారి సినిమాలు తీస్తున్నప్పట్నుంచి తక్కువ రేటుకొచ్చే హీరోయిన్లనే ఎంచుకుంటున్నాడు పూరి. దీనికోసం చార్మితో కలిసి ఏకంగా పూరికనెక్ట్ అనే ఏజెన్సీని కూడా స్థాపించాడు.

ఉన్నవాళ్లలో తక్కువ రెమ్యూనరేషన్ కు వచ్చే హీరోయిన్ ను తీసుకుంటాడు, లేదంటే డెడ్ చీప్ గా తనే ఓ కొత్తమ్మాయిని పరిచయం చేస్తాడు. ఇదే పూరియిజం. టెంపర్ తర్వాత పూరి తీసిన ఏ ఒక్క సినిమాలో స్టార్ హీరోయిన్ లేదు. భవిష్యత్ లో కూడా ఉంటుందని ఆశించక్కర్లేదు. అదంతే..!

నాడు పంచెలు ఊడేలా కొట్టే కళ.. నేడు 'తాట తీయు' కళ 

పవన్ దారెటు? సతీష్ చందర్ ఈవారం టాపిక్ అఫ్ ది వీక్