మహేష్ ఫ్యామిలీ నుంచి రాజ్ తరుణ్ కు

ఏ ప్రాజెక్టు ఎవరికి ప్రాప్తమో? నిర్మాత దిల్ రాజు ఓ ప్రాజెక్టును మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కొడుకు కోసం తయారుచేయించారు. ఓపెనింగ్ కూడా అయిపోయింది. కానీ ఏం జరిగిందో ఏమో, ఆ…

ఏ ప్రాజెక్టు ఎవరికి ప్రాప్తమో? నిర్మాత దిల్ రాజు ఓ ప్రాజెక్టును మహేష్ బాబు మేనల్లుడు, గల్లా జయదేవ్ కొడుకు కోసం తయారుచేయించారు. ఓపెనింగ్ కూడా అయిపోయింది. కానీ ఏం జరిగిందో ఏమో, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది.

కట్ చేస్తే… రాజ్ తరుణ్ హీరోగా దిల్ రాజు నిర్మాణంలో ఓ ప్రాజెక్ట్ ఫైనల్ అయిందని వార్తలు వచ్చాయి. విచారిస్తే, అదే ఇది అని తెలుస్తోంది. అక్కడ ఆగిపోయిన ప్రాజెక్టు ఇక్కడ మొదలవుతోందని వినికిడి. సినిమాకు దర్శకుడు కృష్ణారెడ్డి. ఆయన గతంలో సుధీర్ బాబుతో ఆడు మగాడ్రా బుజ్జీ అనే సినిమా అందించారు. ఆయనే ఈ సినిమాకు కథ, దర్శకత్వం.

బహుశా దిల్ రాజుకు కథ మీద బాగా బలంగా నమ్మకం వుండి వుండాలి. లేదా అంటే అంత పట్టుదలగా అదే సినిమా ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేస్తారు? పోనీ మొత్తానికి రాజ్ తరుణ్ కు ఓ సినిమా వచ్చినట్లయింది ఈ పరిణామం వల్ల.

కేజ్రీవాల్ దారెటు.. వ్యతిరేక సర్వేల నిజమెంత?

స్వామీజీ లేకపోయినా.. సేవలు ఆగరాదు!