జెర్సీ పంట పండింది

నాని-హారిక హాసిని-డైరక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తయారవుతున్న హార్ట్ టచ్చింగ్ సినిమా జెర్సీ. ఈ సినిమా సబ్జెక్ట్ విపరీతంగా నచ్చి, నాని రెమ్యూనిరేషన్ లేకుండా, ఫ్రాఫిట్ షేరింగ్ మీద చేస్తున్నారు. ఇప్పుడు ఈ…

నాని-హారిక హాసిని-డైరక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తయారవుతున్న హార్ట్ టచ్చింగ్ సినిమా జెర్సీ. ఈ సినిమా సబ్జెక్ట్ విపరీతంగా నచ్చి, నాని రెమ్యూనిరేషన్ లేకుండా, ఫ్రాఫిట్ షేరింగ్ మీద చేస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు మాంచి బిజినెస్ స్టార్ట్ అయింది. సినిమా శాటిలైట్ డిజిటల్, అడియో రైట్స్ అన్నీకలిపి దగ్గర దగ్గర 12 కోట్లకు విక్రయించేసారు. అలాగే హిందీ అనువాద తదితర హక్కులు సుమారు 6 కోట్లకు ఇచ్చేసారు. అంటే నాన్ థియేటర్ హక్కులే 18 కోట్ల మేరకు ఆదాయం తెచ్చిపెట్టాయి.

ఇక ఓవర్ సీస్ హక్కులు నాలుగు కోట్లకు కాస్త పైగానే విక్రయించేసారు. నాని సినిమా అంటే యూజివల్ గా ఆంధ్ర-తెలంగాణ కలిపి 25 కోట్లకు పైగా 30 కోట్లకు తక్కువగా థియేటర్ హక్కులు వస్తాయి. అంటే దగ్గర దగ్గర యాభైకోట్ల మేరకు టోటల్ బిజినెస్ అయ్యే అవకాశం వుందన్నమాట. ఇది దాదాపు నాని సినిమాల్లో రికార్డు అనే చెప్పాలి.

ఇదిలావుంటే ఆంధ-సీడెడ్ ఏరియాల్లో తమ రెగ్యులర్ బయ్యర్లకు కాస్త రీజనబుల్ రేట్లకే జెర్సీ సినిమాను ఇవ్వాలని హారిక హాసిని సంస్థ చూస్తున్నట్లు బోగట్టా. హారిక హాసిని నిర్మించే సినిమాల రేట్లు ఎక్కువ వుంటాయని, బయ్యర్లకు కిట్టుబాటు కావడం కష్టమని బయ్యర్ల సర్కిళ్లలో చిన్న టాక్ వుంది.

అందుకే ఈసారి తమ రెగ్యులర్ బయ్యర్లకు బాగా రీజనబుల్ రేట్లకు ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ నేపథ్యంలో నిర్మిస్తున్న జెర్సీ సినిమా కోసం ఇటీవల లాల్ బహదూర్ స్టేడియంలో భారీ ఖర్చుతో డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్ ను చిత్రీకరించారు. మే నెలలో ఈ సినిమా విడుదలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

కేజ్రీవాల్ దారెటు.. వ్యతిరేక సర్వేల నిజమెంత?

స్వామీజీ లేకపోయినా.. సేవలు ఆగరాదు!