52 శాతం నుంచి 72 శాతం.. అర్థమైందా బాబూ!

“జగన్ అరాచక పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. వైసీపీ పాలనతో ఏ వర్గం సంతృప్తిగా లేదు. రాష్ట్రమంతా ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.” తన ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు సాగిస్తున్న దుష్ప్రచారం ఇది. ఇప్పుడీ…

“జగన్ అరాచక పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. వైసీపీ పాలనతో ఏ వర్గం సంతృప్తిగా లేదు. రాష్ట్రమంతా ప్రజలు అసంతృప్తితో ఉన్నారు.” తన ఎల్లో మీడియాతో కలిసి చంద్రబాబు సాగిస్తున్న దుష్ప్రచారం ఇది. ఇప్పుడీ ప్రచారం మొత్తం డొల్ల అని తేలిపోయింది. ఆత్మకూరు విజయంతో ప్రజలంతా మరోసారి జగన్ వెంటే ఉన్నారనే విషయం స్పష్టమైంది.

గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో వచ్చిన ఎన్నికలు కావడం, స్వయంగా కుటుంబ సభ్యుడు విక్రమ్ రెడ్డి బరిలోకి దిగడంతో సెంటిమెంట్ కొద్దీ ఆయనకు భారీ మెజారిటీ వచ్చిందని టీడీపీ నేతలు సాకులు వెదికే పనిలో ఆల్రెడీ ఉన్నారు. కానీ ఇక్కడ మేటర్ అది కాదు. విక్రమ్ రెడ్డికి ఎంత మెజారిటీ వచ్చిందనేది ముఖ్యం కాదు. వైసీపీకి ఓట్ షేర్ ఎంత పెరిగిందనేది చూడాలి.

గౌతమ్ రెడ్డి పోటీ చేసినప్పుడు వైసీపీకి ఆత్మకూరులో 52 శాతం ఓట్ షేర్ ఉంది. ఇప్పుడా ఓట్ షేర్ ఏకంగా 72శాతానికి పెరిగింది. అంటే.. అప్పటికీ ఇప్పటికీ వైసీపీ ఓటు బ్యాంక్ 20శాతం పెరిగింది. ఓవైపు పోలింగ్ పర్సంటేజీ తగ్గినప్పటికీ, ఓటు షేర్ పెరగడానికి కారణం ఆత్మకూరులో స్థానికంగా ఉన్న సెంటిమెంట్ కానే కాదు. జగన్ పాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పుకు నిదర్శనం ఈ ఓటు షేర్. గెలిచిన విక్రమ్ రెడ్డి కూడా ఇదే మాట అన్నారు.

ఇప్పుడు బాబు అండ్ కో ఏం చేయాలి..?

ఇకనైనా చంద్రబాబు, అతడి మీడియా అబద్ధాలు ప్రచారం చేయడం మానుకోవాలి. వైసీపీని, జగన్ ను నిత్యం తిడితే తమకు ఓట్లు రాలవనే విషయాన్ని గ్రహించాలి. “ఆత్మకూరులో మనం పోటీ చేయలేదు తమ్ముళ్లు, అందుకే వాళ్లకు అంత మెజారిటీ వచ్చింది” అంటూ రాబోయే రోజుల్లో చంద్రబాబు గొప్పలు చెప్పుకోవచ్చు. పైపైన కవరింగ్ ఇచ్చుకోవచ్చు.

కానీ ఓటు షేర్ విషయంలో చంద్రబాబు ఆత్మవిమర్శ చేసుకోవాల్సి అవసరం ఉంది. పోలింగ్ పర్సంటీజీ తగ్గినా అమాంతం 20శాతం వైసీపీకి ఓటు షేర్ పెరిగిందంటే.. ఆ నియోజకవర్గంలో ఇన్నాళ్లూ టీడీపీ వైపు ఉన్న ఓటర్లు కూడా వైసీపీ వైపు వచ్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది.

ఈసారి రివ్యూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ఇలాంటి వాస్తవమైన అంకెలతో, నిర్మోహమాటంగా సమీక్షలు జరిపితే, చంద్రబాబుకు అతడి పార్టీకి ఎంతో మంచిది. అలా కాకుండా, ఈ ఫలితాల తర్వాత కూడా చంద్రబాబు ఎప్పట్లానే తన పాత పద్ధతిలోనే వెళ్తానంటే మాత్రం 2024లో ఇంట్లో కూర్చునే పరిస్థితి వస్తుంది.

11 Replies to “52 శాతం నుంచి 72 శాతం.. అర్థమైందా బాబూ!”

  1. ఇలానే జీ బలుపు మాటలతో… జలగడు నే ఇంట్లో కూర్చోబెట్టారు… వాపు చూసి బలుపు అనుకోవటం అంటే ఇలాంటి ఆర్టికల్స్ యే రా.. మీలాంటి భజన్ లాల్స్ అప్పట్లో వాడి పాలన ఆహా పథకాలు ఓహో అంటే జనాలు ఓట్లు వేయరు.. పరిపాలన, అభివృద్ధి చూసి ఓట్లు వేస్తారు.. అప్పులు తెచ్చాను పథకాలు పంచాను అదే పరిపాలన. అనుకుంటే ఎలారా రిగ్రెట్ ఆంధ్రా !!!! ఇప్పుడు ఏమో ఆ సజ్జలగాడి పై ఏడుస్తున్నావు.. ఇప్పటికీ ఆ జలగ ఒక చేతకాని దద్దమ్మ పాలన చేతకాని అసమర్థుడు అని మాత్రం రాయలేవు.. నీకెందుకు జర్నలిజం !!

Comments are closed.