మంచి మద్యం, మంచి సిగరెట్లు కూడా ఉంటాయా..?

వైసీపీ హయాంలో మద్యంలో విషం చేరిందంటూ ఇటీవల టీడీపీ కొత్త వాదన తలకెత్తుకుంది. ప్రైవేట్ ల్యాబ్ లలో టెస్ట్ చేయించామని, మద్యంలో హానికర పదార్థాలున్నాయంటూ కొంతమంది టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి హడావిడి…

వైసీపీ హయాంలో మద్యంలో విషం చేరిందంటూ ఇటీవల టీడీపీ కొత్త వాదన తలకెత్తుకుంది. ప్రైవేట్ ల్యాబ్ లలో టెస్ట్ చేయించామని, మద్యంలో హానికర పదార్థాలున్నాయంటూ కొంతమంది టీడీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి హడావిడి చేస్తున్నారు. వారికి టీడీపీ అనుకూల మీడియా ఎక్కడలేని ప్రచారం కల్పిస్తోంది. 

అయితే మద్యంలో ఏదీ మంచిది కాదని, మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని ఆ బాటిల్ పైనే రాసి ఉంటుందని చమత్కరించారు మంత్రి అంబటి రాంబాబు. మద్యం తాగితే ప్రమాదమేనని చెప్పారు.

సిగరెట్లలో మంచి సిగరెట్లు, మందులో మంచి మందు ఎక్కడైనా ఉంటుందా అని లాజిక్ తీశారు మంత్రి. టీడీపీ హయాంలో ఉన్న కంపెనీలే ఇప్పుడూ ఉన్నాయని, అప్పట్లో ఆ విస్కీ అమృతమైతే.. ఇప్పుడు అదే విస్కీ విషం ఎలా అవుతుందని ప్రశ్నించారు అంబటి.

కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి లేదు..

వైసీపీ అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదని, గతంలోని డిస్టిలరీలే ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయని చెప్పారు అంబటి రాంబాబు. కొత్తగా తాము చేసిందేమీ లేదని, కావాలనే ప్రభుత్వంపై బురదజల్లేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 

మద్యం తాగడం వల్ల ఎవరి నరాలు దెబ్బతిన్నాయో తెలియవు కానీ, చంద్రబాబు అండ్ కో కి మాత్రం నరాలు దెబ్బతిన్నాయని, అందుకే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు.

అధికారులు చర్యలు తీసుకోవాలి..

ఒక పథకం ప్రకారమే ఏపీకి నిధులు రాకుండా టీడీపీ నాయకులు అడ్డుకోవాలని చూస్తున్నారని, అందుకే ఆర్బీఐ సహా ఇతర సంస్థలకు లేఖలు రాస్తున్నారని అన్నారు అంబటి. ఇందులో భాగంగానే.. మద్యంపై విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విషం మద్యంలో లేదని, మీ బుర్రలోనే ఉందంటూ ఆయన టీడీపీ నాయకులపై విరుచుకుపడ్డారు.

మద్యంలో విషం ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై అధికారులు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు అంబటి. బీజేపీతో కలసి టీడీపీ కుట్రలు చేసినా ఆత్మకూరులో వైసీపీకి ఘన విజయం లభించిందని చెప్పారు. ప్రతి ఉప ఎన్నికలోనూ వైసీపీకి మెజార్టీ పెరుగుతూ పోతోందని అన్నారు. 

అసలు బీజేపీ, జనసేన కాపురం సజావుగా సాగుతోందా అని ప్రశ్నించారు. తిరుపతిలో బీజేపీ తరపున ప్రచారానికి వచ్చిన పవన్, బద్వేల్, ఆత్మకూరులో ఎందుకు రాలేదని అన్నారు. 

13 Replies to “మంచి మద్యం, మంచి సిగరెట్లు కూడా ఉంటాయా..?”

  1. అరగండోడికి సిగ్గు శరం లేక ఏదో అన్నాడనుకో..

    వేసెయ్యటానికి నీకు లేదా ఎంకటి…

  2. అరగండోడికి-సిగ్గు-శరం-లేక-ఏదో-అన్నాడనుకో..

    వేసెయ్యటానికి-నీకు-లేదా-ఎంకటి…

  3. మరి “కల్తీ మద్యం తాగి జనానికి అస్వస్థత” అనే హెడింగ్ లు paper లలో ఎందుకు వస్తాయి.

  4. మూ హయాంలో కొత్త డిస్టిలరీలకు అనుమతి ఇవ్వలేదు కానీ, ఉన్న‌ డిస్టిలరీలను అదిరించి, బెదిరించి లాక్కొని బూమ్ బూమ్ లు, ప్రెసిడెంట్ మెడల్లు, స్షెషల్ స్టేటస్లు చేసి, పది రూపాయలది, వందకు అమ్మారు అంతేకదా అంబటీ

  5. అంబటి గొప్ప డాన్సర్. స్టెప్స్ తో అదర గొడుతారు.

    గొప్ప మేధావి. పోలవరం ప్రాజెక్ట్ అసలు ఏమిటో అర్థం కావటం లేదు అని చెప్పిన మేధావి.

    గొప్ప రసికుడు. రాస లీలలకు తక్కువ కాదు.

    ఇటువంటి కామెడీ పర్సనాలిటీ చేసే ప్రసంగాలని విమర్శలని ప్రజలు సీరియస్ గా తీసుకోవాలా ?

    ఏదో వాగుడుకాయ అనుకుంటారు తప్ప.

  6. అంబటి గారికి ఎవరైనా చెప్పండయ్యా… మంచి అంటే క్వాలిటీ అని. అంతేగానీ… మంచి అంటే ఆరోగ్యానికి మంచిది అని కాదు అని.

  7. మంచిలో “తీపి – మధురం – అమృతం” ఉన్నట్లుగానే; చెడులో కూడా “చేదు – విషం – పాషాణం”

Comments are closed.