Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఛత్రపతి రీమేక్..ఎక్కడ?

ఛత్రపతి రీమేక్..ఎక్కడ?

ప్రభాస్ ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేయాలని డిసైడ్ అయిపోయారు బెల్లంకొండ శ్రీనివాస్. ఇది ఒక విధంగా కాదు రెండు విధాల సాహసం. ఓ రేంజ్ లో ప్రభాస్ ఎమోషన్లు చూపించిన సినిమా. 

దాన్ని రీమేక్ చేయడం ఒక ఎత్తు. ఆ సినిమాతో హిందీలోకి డైరెక్ట్ గా ఎంట్రీ ఇవ్వడం ఇంకో ఎత్తు. హిందీ డైరెక్టర్లు ఎవరైనా దొరికి వుంటే వేరుగా వుండేదేమో? మన వివి వినాయక్ తోనే ముందుకు వెళ్లారు. 

ఎలా వచ్చింది? ఏమిటి? ఎప్పుడు విడుదల? అన్నది క్లారిటీ లేదు. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ గా తెలుస్తోంది. ఈ సినిమాకు టైటిల్ దొరకడం కష్టంగా వుందట. ఛత్రపతి..శివాజీ...ఇలా దానికి కిలో మీటర్ ఇటు కిలో మీటర్ అటు వున్న టైటిళ్లు అన్నీ హిందీలో వేరే వాళ్లు రిజిస్టర్ చేసేసుకున్నారట. దాంతో సరైన టైటిల్ దొరక్క తెగ వెదికేస్తున్నారట.

ఈ మరి ఈ టైటిల్ ఎప్పుడు ఫిక్స్ అవుతుందో? సినిమా ఎప్పుడు రెడీ అయి హిందీ తెర మీదకు వస్తుందో? తెలుగులో విడుదల చేసినా, ప్రభాస్ ఫ్యాన్స్ ఊరుకుంటారా? సినిమా ఎలా వున్నా కూడా ఓ రేంజ్ లో మోసేస్తారేమో? 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?