పృధ్వీ రాజ్..ఇలా మాకొద్దు

మలయాళ హీరో పృధ్వీరాజ్. తెలుగువారికి కూడా బాగా నచ్చిన నటుడు. ఉరిమి దగ్గర నుంచి అయ్యప్పన్ కోషియమ్ మీదుగా నిన్న మొన్నటి జనగణమన వరకు. వైవిధ్యమైన కథలు, వైవిధ్యమైన పాత్రలు, నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా…

మలయాళ హీరో పృధ్వీరాజ్. తెలుగువారికి కూడా బాగా నచ్చిన నటుడు. ఉరిమి దగ్గర నుంచి అయ్యప్పన్ కోషియమ్ మీదుగా నిన్న మొన్నటి జనగణమన వరకు. వైవిధ్యమైన కథలు, వైవిధ్యమైన పాత్రలు, నిర్మాతగా, దర్శకుడిగా, నటుడిగా అన్నింటా వైవిధ్యం. అందుకే పృధ్వీరాజ్ అంటే అభిమానం. 

అతగాడు నటించిన మలయాళ సినిమాలు అన్నీ ఓటిటి లో మన సినిమా అభిమానులు చూస్తూనే వుంటారు. బహుశా అందుకే కావచ్చు ఈసారి తన సినిమాను తెలుగులో నేరుగా విడుదల చేయాలనుకున్నాడు. చేస్తున్నాడు. ఆ ప్రమోషన్ కోసం హైదరాబాద్ కు వచ్చేసాడు కూడా. 

కడువా అనే సినిమా షాజీ కైలాస్ డైరక్షన్ లో చేస్తున్నాడు. ఇతగాడు మన వివి వినాయక్ టైప్ మాస్ డైరక్టర్. సీనియర్ మోస్ట్…పాతిక ముఫై సినిమాలు డైరెక్ట్ చేసిన వాడు. అంతకు మించి, మన తెలుగులో మన మంచు హీరో విష్ణు తో విష్ణు అనే సినిమాను అందించాడు. 

అలాంటి డైరక్టర్ తో మాంచి మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు పృధ్వీరాజ్. అదే కడువా…నిన్న వచ్చిన ట్రయిలర్ చూడానికి పృధ్వీ ఫ్యాన్స్ కు నీరసం వచ్చింది. ఇలాంటి యాక్షన్ సినిమాలు చేయడానికి మన దగ్గర హీరోలు చాలా మంది వున్నారు. డైరక్టర్లు చాలా మంది వున్నారు. ఇలాంటి సినిమాతో పాన్ ఇండియా విడుదల ట్రయ్ చేయడం కరెక్టేనా అన్నది పృథ్వీరాజ్ తెలుసుకోవాలి. 

కడువా హిట్ అవ్వొచ్చు..కాకపోవచ్చు. అది వేరే సంగతి. కానీ పృధ్వీరాజ్ అంటే మన జనాలకు ఓ ఇమేజ్ వుంది దాన్ని నిలబెట్టే సినిమా తెలుగులోకి రావాలి. అదే కావాలి.