తెరపైకి త్రివిక్రమ్-వెంకీ సినిమా

చాలాకాలం క్రితమే ప్రకటించారు వెంకీ-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాను. అయితే అజ్ఞాతవాసి ఫలితం తరువాత కొన్నాళ్లు గ్యాప్, ఆ తరువాత అరవింద సమేత సినిమా అయ్యాయి. ఇప్పుడు బన్నీతో సినిమా మీదకు వెళ్లారు త్రివిక్రమ్. దాంతో…

చాలాకాలం క్రితమే ప్రకటించారు వెంకీ-త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాను. అయితే అజ్ఞాతవాసి ఫలితం తరువాత కొన్నాళ్లు గ్యాప్, ఆ తరువాత అరవింద సమేత సినిమా అయ్యాయి. ఇప్పుడు బన్నీతో సినిమా మీదకు వెళ్లారు త్రివిక్రమ్. దాంతో వెంకీ సినిమా ఎప్పుడో అనుకునే పరిస్థితి వచ్చింది.

అయితే లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, బన్నీ-త్రివిక్రమ్ సినిమాలో కదలిక వచ్చింది. బన్నీ సినిమా తరువాత ప్రాజెక్టు ఇదే అని తెలుస్తోంది. వెంకీ సరైన కామెడీ చేస్తే సినిమా ఏ రేంజ్ లో వుంటుందో అప్పట్లో మల్లీశ్వరి చెప్పింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఎఫ్ 2 చెబుతోంది.

అందులో హారిక హాసిని బ్యానర్ లో బన్నీ సినిమా తరువాత త్రివిక్రమ్-వెంకీ సినిమాను స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మేరకు వెంకీ కూడా ఎఫ్ 2 తరువాత సినిమాగా త్రివిక్రమ్ సినిమానే చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

అంతా బాగానే వుంది. వెంకీ, రానా సినిమాలు అంటే లాభాల్లో వాటా, సమర్పణ అంటూ టైటిల్ వేయడం సురేష్ బాబుకు అలవాటు. పైగా బన్నీ-త్రివిక్రమ్ సినిమా కూడా ఇలాగే షేరింగ్ మీద నడుస్తోంది. అందువల్ల వెంకీ సినిమాకు కూడా హారిక హాసినికి భాగస్వామ్యం తప్పదేమో?

అయన ఏ గాలికి ఆ చాప ఎత్తుడేనా..? ఈవారం బిగ్ స్టోరీ

ఆ నలుగురు.. ఆ నలుగురు అంటారే.. దిల్ రాజు సమాధానమేంటో తెలుసా?