ఈ మధ్య సినిమాల్లో పీరియాడిక్ సినిమాలు ఎక్కువయ్యాయి. రంగస్థలం సినిమా పుణ్యమా అని. అలాగే సినిమాల లోగోల గోల కూడా పెరిగింది. సినిమా కథ అంతా లోగోలో గుట్టుగా దాచి, ప్రదర్శించే పని. రంగస్థలం సినిమా లోగో అప్పటి కాలాన్ని సూచించేలా తయారుచేసారు. రవితేజ అమర్ అక్బర్ ఆంథోని లోగో, కథ మొత్తం అందులో వుంది అనేలా తయారుచేసారు.
మొన్నటికి మొన్న వినయ విధేయరామ లోగో గురించి దర్శకుడు బోయపాటి బోలెడు చెప్పారు. లోగోలోనూ అది కనిపించలేదు. సినిమాలోనూ కనిపించలేదు. అదివేరే సంగతి. నిన్నటికి నిన్న రవితేజ డిస్కోరాజా లోగో వచ్చింది. కథ, వ్యవహారం చెప్పకనే చెప్పేటట్లు ఆ లోగో అందించారు.
మొత్తంమీద చూసుకుంటే మళ్లీ దర్శకులకు లోగోల గోల పట్టినట్లుంది. లేటెస్ట్ గా ఇప్పుడే మరో లోగో వచ్చింది. దర్శకుడు హరీష్ శంకర్ దాదాపు ఏడాదిన్నర తరువాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకునే సినిమా వాల్మీకి స్టార్ట్ అయింది. వరుణ్ తేజ్ నెగిటివ్ షేడ్ లో కనిపించే క్యారెక్టర్ చేస్తున్నాడు.
ఈ సినిమా లోగో వదిలారు. ఇది కూడా ఏదో 80వ దశకంలో సినిమాల లోగోల మాదిరిగా వుంది. సినిమాలో రౌడీయిజం, అలాగే సినిమా నేపథ్యం వుంటాయి. ఆ రెండూ తెలిసేలా రివాల్వర్, సినిమా రీలు రెండూ లోగోలో పెట్టారు. చిత్రం ఏమిటంటే, ఇప్పుడు రీళ్లు అన్నవే లేవు. హార్డ్ డిస్క్ లే తప్ప.
టోటల్ గా చూసుకుంటే హరీష్ శంకర్ గత సినిమా డిజె లోగో ఎంత స్టయిలిష్ గా వుంటుందో, వాల్మీకి సినిమా లోగో అంత ఓల్డ్ లుక్ తో వుంది. మరి హరీష్ శంకర్ ఆలోచన ఏమిటో?
అయన ఏ గాలికి ఆ చాప ఎత్తుడేనా..? ఈవారం బిగ్ స్టోరీ
ఆ నలుగురు.. ఆ నలుగురు అంటారే.. దిల్ రాజు సమాధానమేంటో తెలుసా?