శ్రీనువైట్ల-అఖిల్ సినిమా.. కొద్దిలో మిస్ అయిన కాంబినేషన్ ఇది. బ్రూస్ లీ దెబ్బకు వైట్లను దూరంపెట్టాడు నాగార్జున. అక్కడితో ఈ కథ అయిపోయిందని అంతా అనుకున్నారు. అక్కినేని ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. కానీ కథ ఇంకా అయిపోలేదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడే స్టార్ట్ అయింది.
అవును.. అమర్-అక్బర్-ఆంటోనీ డిజాస్టర్ తర్వాత వైట్ల మరోసారి అక్కినేని కాంపౌండ్ లో చక్కర్లు కొడుతున్నాడు. ఈసారి అఖిల్ తో సినిమా గ్యారెంటీ అంటూ పుకార్లు రావడంతో ఫ్యాన్స్ గుండెలు గుభేల్ మన్నాయి. ఎక్కడ నాగ్-అఖిల్ కలిసి వైట్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారేమో అని అంతా తెగ టెన్షన్ పడుతున్నారు.
అయితే వైట్ల మాత్రం తన ప్రయత్నాలు ఆపలేదని తెలుస్తోంది. ఇన్నాళ్లూ అఖిల్ ను లవర్ బాయ్ గానే అంతా చూశారని, తనకు ఓ ఛాన్స్ ఇస్తే అతడిలో కామెడీ టైమింగ్ బయటకు తెస్తానంటూ నాగ్ ను ఊరిస్తున్నాడట. మరీ ముఖ్యంగా కెరీర్ స్టార్టింగ్ లో నాగార్జున చేసిన సినిమాలకు, అఖిల్ చేస్తున్న సినిమాలకు పోలిక పెడుతూ ఏవేవో చెబుతున్నాడట వైట్ల.
మొత్తమ్మీద ఈసారి వైట్ల అనుకున్నది సాధించేలా ఉన్నాడు. ఇటువైపు చూస్తే మిస్టర్ మజ్ను పరిస్థితి మరీ తీసికట్టుగా తయారైంది. నిన్ననే రిలీజైన ఈ సినిమా థియేటర్లలో మిక్స్ డ్ టాక్ తో నడుస్తోంది. ఇలాంటి టైమ్ లో వైట్లతో సినిమా అంటూ వస్తున్న కథనాలు ఫ్యాన్స్ ను మరింత కుంగదీస్తున్నాయి.
బయోపిక్ కంటే.. నాదెండ్ల ఇంటర్వ్యూలను చూస్తున్న వాళ్ళే ఎక్కువా?
అన్నింట్లోనూ అదే తీరు.. ప్రజల్లో పలుచన అవుతున్న పచ్చ పార్టీ అధినేత