ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే… మధ్యలో డ్రైవర్…!

అప్పుడెప్పుడో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి. అలాంటిదే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్టోరీ కూడా. అయితే ఇక్కడ పేరు మాత్రం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ… మధ్యలో…

అప్పుడెప్పుడో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన సినిమా అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి. అలాంటిదే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా స్టోరీ కూడా. అయితే ఇక్కడ పేరు మాత్రం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ… మధ్యలో డ్రైవర్. అవును నిజమే… ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న టైటిల్. కాకినాడ జిల్లా వైసీపీ ప్రస్తుత ఎమ్మెల్సీ మాజీ డ్రైవర్ సుబ్రమణ్యం అనుమానాస్పద మృతి వ్యవహారంలో ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న ఏమిటంటే… సుబ్రమణ్యం ఎలా చనిపోయాడు అనే దానికంటే కూడా… ఎందుకు చనిపోయాడు అనే విషయంపైనే ఎక్కువగా చర్చ నడుస్తోంది. 

ఐదేళ్ల పాటు ప్రజంట్ ఎమ్మెల్సీ దగ్గర సుబ్రమణ్యం ఎంతో నమ్మకంగా డ్రైవర్‌గా పనిచేశాడట. ఏదో ఆర్థిక అవసరాల కోసం 70 వేల రూపాయలు అప్పుగా తీసుకున్నాడట. యజమాని దగ్గర అప్పు చేయడం తప్పు కాదు. అందులో 50 వేలు కూడా తిరిగి ఇచ్చేశాడట. ఇది ఇంకా బాగుంది. యజమాని జీతంలో కట్ చేయక ముందే సుబ్రమణ్యం తిరిగి ఇచ్చేసినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక మిగిలింది 20 వేల రూపాయలు మాత్రమే. వాస్తవానికి ఓ ఎమ్మెల్సీకి… అది కూడా అధికార పార్టీ నేతకు…. పార్టీలో చక్రం తిప్పగల సామర్థ్యం ఉన్న అనంత ఉదయ్ భాస్కర్ లాంటి రాజకీయ వేత్తకు అయితే అదో పెద్ద అమౌంట్ అసలే కాదు. అయినా సరే… వాటి కోసం ఏకంగా అనంత ఉదయ్ భాస్కర్ స్వయంగా ఫోన్ చేసి బెదిరించాడట. ఎప్పుడిస్తావని గట్టిగా నిలదీశాడట. 

ఐదేళ్లు నమ్మకంగా పని చేసిన వ్యక్తి 20 వేలు ఇవ్వకపోతే తీసుకెళ్లి కొడతారా….? ఇదే ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న. అసలు కారణం వేరే ఉంటుందనేది ఇప్పుడు అందరిలో ఉన్న అనుమానం. అటు పార్టీలోనే కాదు… జిల్లాలో కూడా ఇదే విషయంపై పెద్ద చర్చ జరుగుతోంది. అసలు లోతుగా ఆలోచిస్తే… 20 వేల కోసం ఎవరైనా డ్రైవర్‌ను తీసుకెళ్లి కొడతారా అనే సామాన్యులకు కూడా అనుమానం వస్తుంది. కానీ అసలు కారణం వేరే ఉందట.

అదేమిటంటే… సదరు అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్… తొలి నుంచి మంచి కళాకారుడే. రాజకీయాలు చేయడంలో దిట్ట కూడా. గతంలో రంపచోడవరం నియోజకవర్గం తరఫున వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా నామినేషన్ కూడా దాఖలు చేశాడు. అయితే సాంకేతిక కారణాలతో అది కాస్త రిజెక్ట్ అయ్యింది. దీంతో డమ్మీ నామినేషన్ దాఖలు చేసిన రాజేశ్వరి అనే మహిళకు తప్పనిసరి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చాడు. గెలిపించుకున్నాడు. నాటి నుంచి రంపచోడవరం నియోజకవర్గంలో నేనే రాజు.. నేనే మంత్రి అన్నట్లుగా వ్యవహరించడంతో… రాజేశ్వరి నాటి అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఇక మనోడికి కోపం వచ్చింది. ఈ సారి ఓ ఉపాధ్యాయురాలిని అభ్యర్థిగా నిలబెట్టాడు. గెలిపించుకున్నాడు. మళ్లీ చక్రం తిప్పడం మొదలుపెట్టాడు. ఇక ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ కూడా అయ్యాడు. అయితే మనోడికి అధికార పార్టీలోని ఓ మహిళా ప్రజా ప్రతినిధితోనే ఎఫైర్ ఉన్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ విషయం డ్రైవర్ సుబ్రమణ్యంకు తెలుసు కూడా. అయితే ఆ ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఆంతరంగికంగా చర్చించుకుంటున్న సమయంలో…. సుబ్రమణ్యం వీడియో తీశాడని…. అందుకే ఆ వీడియో కోసం జరిగిన గొడవలోనే అతను మృతి చెందినట్లు ఓ పుకారు.

ఇదే సమయంలో మరో చర్చ కూడా నడుస్తోంది. కాకినాడ నగరానికి చెందిన ఓ బడా పారిశ్రామిక వేత్త కుమార్తెతో అనంత ఉదయ్ భాస్కర్ సంబంధం పెట్టుకున్నాడని… వీరిద్దరూ చాలా సార్లు కలుస్తుంటారని చర్చ. సుబ్రమణ్యం ఎన్నోసార్లు ఆ యువతిని వాళ్ల ఇంటి దగ్గర స్వయంగా కారులో దింపినట్లు కూడా తెలుస్తోంది. అలా డ్రాపింగ్ సమయంలో సుబ్రమణ్యం ఆ యువతితో ఏదో అసభ్యంగా ప్రవర్తించాడని… ఆ విషయం తెలుసుకున్న ఉదయ్ భాస్కర్… సుబ్రమణ్యంపై దాడి చేసినట్లు కాకినాడ వ్యాప్తంగా జోరుగా చర్చ. 

ఏదీ ఏమైనా… ఉదయ్ భాస్కర్‌కు మహిళా ఎమ్మెల్యేకు ఉన్న బంధం ఏమిటీ… సుబ్రమణ్యం నుంచి నిజంగా 20 వేల రూపాయల కోసమే ఉదయ్ భాస్కర్ గొడవ పడ్డాడా… నిన్న మొన్నటి వరకు రంపచోడవరం నియోజకవర్గంలో అన్నీ తానే అన్నట్లు చక్రం తిప్పిన ఉదయ్ భాస్కర్‌కు కష్టం వస్తే… సదరు నేతలంతా ఏమయ్యారు. అసలు ఇంత గొడవ జరుగుతున్నా కూడా… పరామర్శకు కూడా ఆ నేత రాలేదు ఎందుకూ… చీటికి మాటికి కాకినాడ వచ్చే సదరు నేతలంతా… ఇప్పుడు ముఖం ఎందుకు చాటేశారు. అసలు పుకార్లలో ఉన్న నిజమెంతా… లోగుట్టు పెరుమాళ్లకు ఎరుక.