జగన్ మంచివాడు… లోకేష్ కి షాక్ … ?

విశాఖలో నాలుగు రోజుల క్రితం గుండె పోటుతో మరణించిన మత్తు డాక్టర్ సుధాకర్ విషయంలో టీడీపీ రాజకీయం పీక్స్ కి చేరిన సంగతి తెలిసిందే. ఏకంగా హైదరాబాద్ నుంచి విమానం కట్టుకుని మరీ లోకేష్…

విశాఖలో నాలుగు రోజుల క్రితం గుండె పోటుతో మరణించిన మత్తు డాక్టర్ సుధాకర్ విషయంలో టీడీపీ రాజకీయం పీక్స్ కి చేరిన సంగతి తెలిసిందే. ఏకంగా హైదరాబాద్ నుంచి విమానం కట్టుకుని మరీ లోకేష్ విశాఖ వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన జగన్ మీద హాట్ హాట్ కామెంట్స్ చేశారు. జగనే ఇదంతా చేశారు అంటూ పెద్ద బండలు వేశారు. జగన్ ప్రభుత్వం కోటి రూపాయలు నష్ట పరిహారం కూడా చెల్లించాలని డిమాండ్ చేశారు.

అయితే ఈ సందర్భంగా సుధాకర్ తల్లి లక్ష్మీ బాయి మాట్లాడిన మాటలే లోకేష్ సహా తమ్ముళ్లకు షాక్ ఇచ్చేలా ఉన్నాయంటున్నారు. ఆమె కూడా జగన్ని నిందిస్తుందని ఆశపడిన వారికి ఆమె మాటలు పూర్తిగా నిరాశపరచాయని చెప్పాలేమో. ముఖ్యమంత్రి జగన్ మంచివారని ఆమె అనడమే ఇక్కడ విశేషం.

లోకల్ గా ఉన్న నాయకుల వల్లనే తన కుమారుడికి అన్యాయం జరిగింది అంటూ ఆమె మొత్తం ఇష్యూని లోకలైజ్ చేసేశారు. దాంతో సుధాకర్ చావుని అడ్డం పెట్టుకుని దళిత కార్డుతో మొత్తం వైసీపీ సర్కార్ ని బదనాం చేద్దామనుకున్న లోకేష్ అండ్ కోకి గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. 

ఏది ఏమైనా ఈ విషయంలో టీడీపీ నేతలు శవ రాజకీయాలు చేస్తున్నారు అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగానే విమర్శించారు.