కమర్షియల్‌ డైరెక్టర్ల కథ ముగిసిందా?

హీరో ఎలివేషన్‌ సీన్లు, పంచ్‌ డైలాగులు, భారీ ఫైటింగులు, ఐటెమ్‌ సాంగులు… ఇలా బాక్సాఫీస్‌ని గెలవడానికి అన్నీ కలిపిన మిశ్రమంతో ఒక ఫార్ములాని తయారు చేసుకున్నారు. దశాబ్ధాల తరబడి పనిచేసిన ఆ ఫార్ములా ఇప్పుడు…

హీరో ఎలివేషన్‌ సీన్లు, పంచ్‌ డైలాగులు, భారీ ఫైటింగులు, ఐటెమ్‌ సాంగులు… ఇలా బాక్సాఫీస్‌ని గెలవడానికి అన్నీ కలిపిన మిశ్రమంతో ఒక ఫార్ములాని తయారు చేసుకున్నారు. దశాబ్ధాల తరబడి పనిచేసిన ఆ ఫార్ములా ఇప్పుడు పలచబడిపోయింది. దీంతో అదే ఫార్మాట్‌ని నమ్ముకున్న దర్శకులు నేటితరం ప్రేక్షకులని ఎలా ఇంప్రెస్‌ చేయాలో తెలియక తమ ప్రతిభని శంకించే సినిమాలు తీయాల్సి వస్తోంది.

అఖిల్‌, ఇంటిలిజెంట్‌ చిత్రాలతో వినాయక్‌ తన ట్రిక్కులు బాక్సాఫీస్‌ వద్ద చెల్లవని చాటుకున్నాడు. పూరి జగన్నాథ్‌ ఎప్పట్నుంచో మరో హిట్టు కొట్టడమెలాగో తెలియక చేతులు కాల్చుకుంటున్నాడు. కమర్షియల్‌ సినిమాకి చివరి ఆసరాగా కనిపించిన బోయపాటి శ్రీను కూడా 'వినయ విధేయ రామ'తో పూర్తిగా గాడి తప్పేసాడు.

ఎప్పుడయితే వినయ విధేయ రామలోని కొన్ని 'ఫన్నీ' సన్నివేశాలని ఫైనల్‌ కట్‌లో వుంచాడో అప్పుడే అతని జడ్జిమెంట్‌పై నమ్మకం పూర్తిగా సడలిపోయింది. ఈ చిత్రం తర్వాత మరో సినిమా ఓకే చేయించుకోవడానికి బోయపాటి బాగా కష్టపడాల్సి వస్తుంది.

చూస్తోంటే ఇక కమర్షియల్‌ డైరెక్టర్ల కథ ముగిసినట్టే వుంది. కమర్షియల్‌ సినిమాలు ఇప్పటికీ వసూళ్లు రాబట్టుకోవచ్చు కానీ అవి లోబడ్జెట్‌లో మాత్రమే వర్కవుట్‌ అవుతాయి తప్ప మన అగ్ర హీరోలపై జరుగుతోన్న వందకోట్ల బిజినెస్‌కి అవి న్యాయం చేయలేవు. 

బయోపిక్ కంటే.. నాదెండ్ల ఇంటర్వ్యూలను చూస్తున్న వాళ్ళే ఎక్కువా?

అన్నింట్లోనూ అదే తీరు.. ప్రజల్లో పలుచన అవుతున్న పచ్చ పార్టీ అధినేత