ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో దర్శకుడు క్రిష్, ప్రాజెక్టులోకి వస్తూనే రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి సినిమాను రెండు భాగాలు చేయడం. రెండవది జనవరిలోనే రెండు వారాల గ్యాప్ లో రెండు భాగాలు విడుదల చేయడం. మొదటి నిర్ణయాన్ని సులువుగానే అందరూ ఒకె చేసారు. కానీ జనవరిలోనే రెండు భాగాలు విడుదల చేయడంపై చాలా మల్లగుల్లాలు నడిచాయి. ఎవరు ఏమన్నా బాలయ్య మాత్రం క్రిష్ దే ఫైనల్ డెసిషన్ అనేసారు.
కానీ ఆఖరికి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో రెండోభాగం విడుదల చేయాలని డిసైడ్ చేసారు. ఇంతలో జరగరానిది జరిగిపోయింది. పార్ట్ వన్ అయిన మహానాయకుడు బాక్సాఫీస్ దగ్గర దారుణంగా విఫలమయింది. మంచి సమీక్షలు వచ్చినా కూడా జనం థియేటర్లకు రాలేదు. దాంతో ఎన్టీఆర్ టీమ్ మొత్తం డీలా పడిపోయింది.
ఇలాంటి నేపథ్యంలో పార్ట్-2 మరోవారం వెనక్కు అంటే ఫిబ్రవరి రెండోవారానికి వెళ్లిందని గ్యాసిప్ లు వినిపించాయి. యూనిట్ మాత్రం వీటిని ధృవీకరించలేదు. ఖండించలేదు. అలా అని డిస్ట్రిబ్యూటర్లకు అయినా డేట్ గురించి అస్సలు చిన్న హింట్ కూడా ఇవ్వలేదు. దీంతో బయ్యర్లు అయోమయంలో పడ్డారు.
ఇప్పుడు లేటెస్ట్ గా వినిపిస్తున్న గ్యాసిప్ ఏమిటంటే, మళ్లీ మరోవారం వెనక్కు వెళ్తుందని. అంటే ఫిబ్రవరి 21న విడుదల అవుతుందని. గతంలో ఎన్నికల ప్రకటన ఫిబ్రవరి 25కే వచ్చేస్తుందని వినిపించింది. ఇప్పుడు మార్చి ఫస్ట్ వీక్ లో వస్తుందని టాక్. అందువల్ల 21న బయోపిక్ విడుదలకు అభ్యంతరం వుండదు.
పైగా అప్పటికి నెలమీదా వారం అయిపోతుంది పార్ట్ వన్ విడుదలై. జనం కూడా కాస్త ఆ పరాజయం గురించి డిస్కషన్ తగ్గించి రెండోభాగంపై దృష్టి పెట్టే అవకాశం వుంది. అయితే ఈ విషయంలో కూడా యూనిట్ నుంచి ఎటువంటి క్లారిటీ బయ్యర్లకు రావడంలేదు.
ఇటీవల బయ్యర్లు ఒకరిద్దరు వేరే పని మీద బాలయ్య దగ్గరకు వెళ్లినపుడు కూడా ఆయన మాట మాత్రం సినిమా విడుదల విషయం ప్రస్తావించలేదని తెలుస్తోంది.
బయోపిక్ కంటే.. నాదెండ్ల ఇంటర్వ్యూలను చూస్తున్న వాళ్ళే ఎక్కువా?
అన్నింట్లోనూ అదే తీరు.. ప్రజల్లో పలుచన అవుతున్న పచ్చ పార్టీ అధినేత