గేయరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి పద్మశ్రీ రావడంపై సోషల్ మీడియా రెండువిధాలుగా స్పందించింది. ఇండస్ట్రీలో పెద్దగా సంబంధం లేనివారు అద్భుతంగా స్పందించారు. అవార్డుకు గౌరవం వచ్చిందని విపరీతంగా స్పందించారు. డైరక్టర్ మారుతి లాంటి కొద్దిమంది ఇండస్ట్రీ జనాలు మాత్రం వెంటనే స్పందించారు.
మెజారిటీ ఇండస్ట్రీ జనాలు, సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే ఇండస్ట్రీ జనాలు మాత్రం స్పందించలేదు. బహుశా శనివారం తీరిగ్గా స్పందిస్తారేమో? టాలీవుడ్ లో స్పందనలు సైతం సామాజిక బంధాలు, అవసరాలు చుట్టూ తిరుగుతాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండే జనరల్ పబ్లిక్ ఎప్పుడో గమనించేసారు.
అందుకే గతంలో ఒకరిద్దరు ప్రముఖ దర్శకులను ఓ రేంజ్ లో ఆడేసుకున్నారు. దాంతో వాళ్లు ఇక ఇలాంటి సామాజిక ఆబ్లిగేషన్ ట్వీట్ లు వేయడం మానుకుని, దూరంగా వున్నారు. ఈ సోషల్ మీడియాలో తమను అస్సలు లెక్కచేయరు, నిర్మొహమాటంగా ట్రోల్ చేస్తారని వాళ్లకు అర్థమైపోయింది. దాంతో సైలెంట్ అయిపోయారు.
సిరివెన్నెల మీద ట్వీట్ లు, స్పందనలు ఏ మేరకు వుంటాయో శనివారం తెలుస్తుంది. అదేవిధంగా చిన్న అవకాశం దొరికితే తమ వాళ్లయితే సన్మానాలకు దిగే సినీజనాలు సిరివెన్నెల విషయంలో ఏం చేస్తాయో చూడాలి.
బయోపిక్ కంటే.. నాదెండ్ల ఇంటర్వ్యూలను చూస్తున్న వాళ్ళే ఎక్కువా?
అన్నింట్లోనూ అదే తీరు.. ప్రజల్లో పలుచన అవుతున్న పచ్చ పార్టీ అధినేత