ఎన్టీఆర్ కథని రెండు భాగాలుగా విడుదల చేస్తే రెండిటికీ కోటానుకోట్ల రూపాయలు కురిసేస్తాయని వేసిన ప్లాన్ దారుణంగా బ్యాక్‌ఫైర్ అయింది. సగం సినిమానే చూపించారనే టాక్‌తో 'ఎన్టీఆర్ కథానాయకుడు' డిజాస్టర్ అయింది. దీంతో రెండవ భాగాన్ని ఎలా ప్రమోట్ చేస్తే క్రేజ్ వస్తుందనేది ఎన్టీఆర్ టీమ్‌కి అంతు చిక్కకుంది.
మొదటి భాగానికే రెండు భాగాలకీ కలిపి ట్రెయిలర్‌ని, ఒకేసారి రెండిటి ఆడియోని విడుదల చేయడంతో కొత్తగా కంటెంట్ ఇవ్వడానికి ఏమీ లేకుంది. పైగా మొదటి సినిమా విడుదలకి ముందే రెండవ భాగంలోని సీన్లకి సంబంధించిన పోస్టర్లనే వదలడంతో కొత్తగా పోస్టర్లు చూపించడానికి కూడా లేకపోయింది.
రెండు భాగాలని డిసైడ్ అయినపుడు కనీసం ప్రచార పరంగా అయినా విడివిడిగా ప్లాన్ చేసుకోవాల్సింది. కానీ ప్రమోషన్లు కంబైన్డ్‌గా చేసి, సినిమాలు విడివిడిగా విడుదల చేయడం వల్ల ఈ తలనొప్పి వచ్చింది. మొదటి సినిమా హిట్ అయినట్టయితే కనీసం ఆ ఊపుండేది. కానీ అదే దారుణంగా ఫ్లాప్ అవడంతో రెండవ భాగాన్ని గట్టిగా ప్రమోట్ చేసుకోవడానికి కూడా మొహమాటపడాల్సి వస్తోంది.
బయోపిక్ కంటే.. నాదెండ్ల ఇంటర్వ్యూలను చూస్తున్న వాళ్ళే ఎక్కువా?
అన్నింట్లోనూ అదే తీరు.. ప్రజల్లో పలుచన అవుతున్న పచ్చ పార్టీ అధినేత