తెలుగు ఇంట పాపులర్ అయిపోయింది బిగ్ బాస్ షో. బిగ్ బాస్ వన్ ను ఆ రేంజ్ కు తీసుకెళ్లి వదిలారు ఎన్టీఆర్. కానీ సీజన్ 2ను ఆయన చేయడానికి కుదరలేదు. దాంతో నాని రంగప్రవేశం చేసారు. అదో పెద్ద రభస. ఏదో మొత్తానికి అయింది అనిపించారు.
ఇప్పుడు సీజన్ 3కి ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టార్ గ్రూప్ ఇప్పుడు డిస్నీగ్రూప్ చేతుల్లోకి వెళ్లిపోయింది. దాంతో పాటే మాటీవీ కూడా. అందువల్ల మరింత పకడ్బందీగా సీజన్ 3 చేయాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.
సీజన్ 3ని హోస్ట్ చేయడానికి ఎన్టీఆర్ సూత్ర ప్రాయంగా అంగీకరించారని బోగట్టా. అయితే ఎప్పుడు ఎలా చేయాలన్నదే సమస్య. ఆర్ఆర్ఆర్ సినిమా షెడ్యూళ్ల గ్యాప్ లో చేసే ఆలోచనలు సాగుతున్నాయి. దాదాపు వందరోజులు గ్యాప్ కావాలి. రాజమౌళి అనుమతి కూడా కావాలి.
అవన్నీ ప్లానింగ్ లో వున్నాయని, డేట్ లు ఎన్టీఆర్ నే చెప్తారని, దానిని బట్టే సీజన్ 3 వుంటుందని తెలుస్తోంది. ఇదిలావుంటే సీజన్ త్రీ హోస్ట్ చేయడం కోసం ఎన్టీఆర్ కు భారీ రెమ్యూనిరేషన్ నే ఆఫర్ చేసారని తెలుస్తోంది. ఈ మొత్తం దాదాపు ఎన్టీఆర్ ఓ సినిమాకు తీసుకునే పారితోషికం కన్నా కాస్త అటుగానే వుంటుందని తెలుస్తోంది.
బయోపిక్ కంటే.. నాదెండ్ల ఇంటర్వ్యూలను చూస్తున్న వాళ్ళే ఎక్కువా?
అన్నింట్లోనూ అదే తీరు.. ప్రజల్లో పలుచన అవుతున్న పచ్చ పార్టీ అధినేత