చందుకు చోటివ్వని శర్వానంద్?

చందుమొండేటి… మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు కార్తికేయ, ప్రేమమ్ సినిమాలతో. అలా సాధించిన క్రెడిట్ అంతా ఖర్చయిపోయింది సవ్యసాచి సినిమాతో. నాగచైతన్యను మాస్ పాత్రల్లో జనం చూడడం లేదు.. అన్నీ డిజాస్టర్లే అని మీడియా ముందుగానే…

చందుమొండేటి… మంచి దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్నాడు కార్తికేయ, ప్రేమమ్ సినిమాలతో. అలా సాధించిన క్రెడిట్ అంతా ఖర్చయిపోయింది సవ్యసాచి సినిమాతో. నాగచైతన్యను మాస్ పాత్రల్లో జనం చూడడం లేదు.. అన్నీ డిజాస్టర్లే అని మీడియా ముందుగానే హెచ్చరించినా, ముందుకే వెళ్లారు చందు. దాంతో మొత్తం పరమపద సోపాన పటం నుంచి కిందకు జారిపోయి, పాము నోట్లో పడిపోయారు.

ఇప్పుడు మళ్లీ సినిమా కావాలి అంటే చాలా కష్టపడాలి. మరో సినిమా తమ బ్యానర్ నే అన్న మైత్రీమూవీస్ సైలంట్ అయింది. ఏ హీరో కూడా డేట్ లు ఇచ్చే పరిస్థితి ఇఫ్పట్లో లేదు. ఈ మధ్యనే హీరో శర్వానంద్ కు కథ చెప్పినట్లు తెలిసింది. కథ ఓకె కానీ ఇప్పట్లో అవకాశం లేదని శర్వానంద్ చెప్పేసినట్లు తెలుస్తోంది.

మిగిలిన ఒకే ఒక ఆధారం నిఖిల్. అతనితో కార్తికేయ-2 చేయాలనుకుంటున్నాడు కానీ… అది కాస్త బడ్జెట్ తో కూడిన సినిమా. ఇరవైకోట్లు కావాలి. నిఖిల్ మీద ఇరవై కోట్లు పెట్టే దమ్ము వున్న నిర్మాత కావాలి. అప్పటిదాకా చందు మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకునే అవకాశం రాదు. 

తప్పు చందుది కాదు. ట్రెండ్ అలా వుంది. ఎన్ని హిట్ లు ఇచ్చారన్నది కాదు. ఫ్లాపు వచ్చిందా, పక్కన పెట్టేసేలా వుంది టాలీవుడ్ పరిస్థితి ఇప్పుడు. హీరోలు చాన్స్ లు తీసుకోవడం లేదు. 

బయోపిక్ కంటే.. నాదెండ్ల ఇంటర్వ్యూలను చూస్తున్న వాళ్ళే ఎక్కువా?

అన్నింట్లోనూ అదే తీరు.. ప్రజల్లో పలుచన అవుతున్న పచ్చ పార్టీ అధినేత