మణికర్ణిక ఫెయిల్యూర్.. క్రిష్, రచయిత ఖాతాలోకా?!

దాదాపు మూడువేల స్క్రీన్స్ పై విడుదల అయ్యింది మణికర్ణిక. అయితే ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఏమాత్రం గొప్పగా లేవని స్పష్టం అవుతోంది. తొలిరోజు కేవలం ముప్పై, ముప్పై ఐదుశాతం మాత్రం ఆక్యుపెన్సీ ఉందట. స్థూలంగా…

దాదాపు మూడువేల స్క్రీన్స్ పై విడుదల అయ్యింది మణికర్ణిక. అయితే ఈ సినిమాకు ఓపెనింగ్స్ ఏమాత్రం గొప్పగా లేవని స్పష్టం అవుతోంది. తొలిరోజు కేవలం ముప్పై, ముప్పై ఐదుశాతం మాత్రం ఆక్యుపెన్సీ ఉందట. స్థూలంగా ఈ సినిమా తొలిరోజున తొమ్మిది కోట్ల రూపాయల గ్రాస్ ను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

వసూళ్ల సంగతలా ఉంటే.. ఈ సినిమాకు రివ్యూయర్లు నెగిటివ్ మార్కులు వేశారు. ఝాన్సీరాణి కథ అంటే.. రోమాలు నిక్కబొడుచుకునేలా చెప్పడానికి అవకాశం ఉన్న కథ. అయితే సినిమాలో అలాంటి ఎలిమెంట్స్ మిస్ అయ్యాయని రివ్యూయర్లు విశ్లేషిస్తున్నారు. కొంతలో కొంత సినిమాను నిలబెట్టింది అంటే.. అది కంగనా రనౌత్ మాత్రమే అని అంటున్నారు.

కంగనా కాకుండా.. ఈ సినిమాలో ఇంకా పేరున్న నటులు ఉన్నా, ఎవరికీ గుర్తిండిపోయేలా అభినయించే అవకాశం దక్కలేదని రివ్యూయర్లు పేర్కొన్నారు. దేశభక్తి సినిమాలన్నీ ఆడతాయని రూలేమీలేదు. గతంలో భగత్ సింగ్ మీద వరసపెట్టి సినిమాలు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. అలాగని భగత్ మీద గౌరవం లేదనికాదు.

మూవీ మేకర్లు ఫెయిల్ అయ్యారని. ఇప్పుడు ఝాన్సీరాణి కథను చెప్పడంలో కూడా విఫలం అయినట్టుగా ఉన్నారు. ఈ సినిమా దర్శకత్వ క్రెడిట్ పూర్తిగా తనకే దక్కుతుందని ఈ మధ్యనే క్రిష్ ప్రకటించాడు. ఎన్టీఆర్ బయోపిక్ సినిమా ప్రచారం అప్పుడు డైరెక్షన్ క్రెడిట్ కంగనాకు దక్కే ఛాన్సేలేదని అన్నాడు. అంతా తనకే అని అన్నాడు.

మరి ఇప్పుడు ఈ సినిమా ఫెయిల్యూర్ నేపథ్యంలో.. ఈ దర్శకుడు దీని క్రెడిట్ తీసుకుంటాడా? ఇక ఈ సినిమాకు రచయితగా పనిచేశాడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్. బయటి సినిమాలకు రచయితగా వ్యవహరించినప్పుడు విజయేంద్ర ప్రసాద్ కు ఇదివరకూ కూడా కొన్ని ఫెయిల్యూర్లున్నాయి. ఇది మరోటి.

బయోపిక్ కంటే.. నాదెండ్ల ఇంటర్వ్యూలను చూస్తున్న వాళ్ళే ఎక్కువా?

అన్నింట్లోనూ అదే తీరు.. ప్రజల్లో పలుచన అవుతున్న పచ్చ పార్టీ అధినేత