వరుణ్‌ తేజ్‌ శాడ్‌ బ్లాక్‌బస్టర్‌ స్టోరీ

ఏ హీరోకి అయినా యాభై కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించిన చిత్రాలు రెండు వున్నట్టయితే అతని మార్కెట్‌కి విపరీతమైన బూస్ట్‌ వస్తుంది. కానీ వరుణ్‌ తేజ్‌కి మాత్రం 'ఎఫ్‌ 2' తర్వాత కూడా కలిసి…

ఏ హీరోకి అయినా యాభై కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించిన చిత్రాలు రెండు వున్నట్టయితే అతని మార్కెట్‌కి విపరీతమైన బూస్ట్‌ వస్తుంది. కానీ వరుణ్‌ తేజ్‌కి మాత్రం 'ఎఫ్‌ 2' తర్వాత కూడా కలిసి వచ్చేదేమీ లేదనే చెప్పాలి. ఇంతకుముందు ఫిదా చిత్రం సక్సెస్‌ క్రెడిట్‌ సాయిపల్లవి, శేఖర్‌ కమ్ముల ఖాతాలోకి పోయినట్టే ఎఫ్‌2 సక్సెస్‌ క్రెడిట్‌ కూడా వెంకీ అకౌంట్‌లో జమ అయిపోయింది.

తనవరకు తన పాత్రని రక్తి కట్టించినా, వెంకీతో చక్కని కెమిస్ట్రీ కుదిరినా కానీ వరుణ్‌ తేజ్‌ సైడ్‌లైన్‌ అయిపోయి వెంకటేష్‌ కామెడీనే హైలైట్‌ అయింది. సినిమా చూసిన వారంతా వెంకటేష్‌ గురించే మాట్లాడుకుంటూ వుండడంతో తన ఖాతాలో మరో సూపర్‌హిట్‌ వుందనే ఆనందం మినహా వరుణ్‌ తేజ్‌కి దీంతో వచ్చేదేమీ లేదనిపిస్తోంది.

అంతరిక్షం చిత్రం ఫ్లాప్‌ అయితే అరకొర వసూళ్లు మాత్రమే సాధించడం, తనకే క్రెడిట్‌ ఇవ్వదగ్గ హిట్‌ అయిన 'తొలిప్రేమ' రేంజ్‌ పాతిక కోట్ల లోపే వుండడంతో వరుణ్‌ తేజ్‌ మార్కెట్‌కి ఎఫ్‌2తో ప్లస్‌ అయ్యేదేమీ వుండదు. సోలోగా భారీ హిట్‌ కొడితే తప్ప వరుణ్‌ మార్కెట్‌కి బూస్ట్‌ రాదు. 

బయోపిక్ కంటే.. నాదెండ్ల ఇంటర్వ్యూలను చూస్తున్న వాళ్ళే ఎక్కువా?

అన్నింట్లోనూ అదే తీరు.. ప్రజల్లో పలుచన అవుతున్న పచ్చ పార్టీ అధినేత