లవ్ లైఫ్ పై స్పందించిన అఖిల్ అక్కినేని!

ప్రస్తుతానికి తను సోలో అని స్పష్టంచేశాడు అఖిల్ అక్కినేని. ఇప్పటికే ఒకసారి పెళ్లి వరకూ వెళ్లి వెనక్కు మళ్లిన అఖిల్ ప్రస్తుతానికి ప్రియురాలు అంటూ ఎవరూ లేరని అన్నాడు. అఖిల్ అక్కినేని ప్రేమకథకు కొన్నినెలల…

ప్రస్తుతానికి తను సోలో అని స్పష్టంచేశాడు అఖిల్ అక్కినేని. ఇప్పటికే ఒకసారి పెళ్లి వరకూ వెళ్లి వెనక్కు మళ్లిన అఖిల్ ప్రస్తుతానికి ప్రియురాలు అంటూ ఎవరూ లేరని అన్నాడు. అఖిల్ అక్కినేని ప్రేమకథకు కొన్నినెలల కిందటే బాగా ప్రచారం వచ్చింది. ఎంగేజ్ మెంట్ నుంచి పెళ్లి అనుకున్న దశలో అది ఆగిపోయింది. అటు సమంతతో చైతూ ప్రేమకథ కు ప్రచారం లభించిన దశలోనే… శ్రేయా భూపాల్ తో అఖిల్ ప్రేమకథ కూడా వార్తల్లో నిలిచింది. ఆ విషయాన్ని తెలుసుకుని చాలామంది ఆశ్చర్యపోయారు. అప్పుడేనా! అనే కామెంట్ గట్టిగా వినిపించింది.

అయితే పెళ్లి వరకూ వెళ్లకుండా ఆగిపోయింది ఆ కథ. ఇక లవ్ లైఫ్ లో అఖిల్ కొత్త చాప్టర్ ఏమైనా స్టార్ట్ చేశాడా? అని అతడితోనే ఆరాతీస్తే.. అలాంటిది ఏమీలేదన్నాడు. ప్రస్తుతానికి అయితే ఎవరూ లేరని.. త్వరలోనే ఎవరో ఒకరిని మీట్ అవుతాననే ఆశాభావాన్ని వ్యక్తంచేశాడు అఖిల్.

పాత స్టోరీ పెళ్లిగా మారే దశలో బ్రేకప్ అయ్యిందని, లవ్ మీద ఇతడిలో విముఖత ఏమీ కనిపించడం లేదు. త్వరలోనే ఎవరో ఒకరిని మీట్ అవుతాను.. అని అంటున్నాడు. సినిమా పూర్తి కావడంతో కొంత గ్యాప్ దొరుకుతోందని.. ఈ గ్యాప్ లోనే తను ఎవరినైనా మీట్ అవుతానేమో అని అఖిల్ అంటున్నాడు!

వైఎస్ బయోపిక్… ఇది బయోపిక్ కాదు డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు