ఈ హీరోల సంగతేమిటి?

సినిమాలు చేయడానికి నిర్మాతలు రెడీగా వున్నారు. హీరోలు లేరు. డైరక్టర్లు లేరు. అలా అని నిజంగా లేరా అంటే, చాలామంది డైరక్టర్లు, హీరోలు ఖాళీగా వున్నారు. వీళ్లను ఎవరూ అడగడం లేదో? చేయడం లేదో…

సినిమాలు చేయడానికి నిర్మాతలు రెడీగా వున్నారు. హీరోలు లేరు. డైరక్టర్లు లేరు. అలా అని నిజంగా లేరా అంటే, చాలామంది డైరక్టర్లు, హీరోలు ఖాళీగా వున్నారు. వీళ్లను ఎవరూ అడగడం లేదో? చేయడం లేదో తెలియదు. పరాజయాలు పలకరిస్తే చాలు పక్కన పెట్టేస్తున్నారు.

రాజ్ తరుణ్ చాన్నాళ్లుగా ఖాళీగా కూర్చున్నారు. నితిన్ రెండు ప్రాజెక్టులు వున్నాయి కానీ ఒకటీ స్టార్ట్ కాలేదు. నిఖిల్ ముద్ర సినిమాను అలా చెక్కుతూనే వున్నారు. అల్లరి నరేష్ చేతిలో మహర్షి సినిమా ఒక్కటే వుంది. మంచు హీరోలు సినిమాలు మరచిపోయినట్లు కనిపిస్తోంది. ఆది పినిశెట్టి వ్యవహారం ఏమిటో తెలియదు. ఇలా ఇంతమంది ఖాళీగా వున్నా, నిర్మాతలు వున్నా, సినిమాలు మాత్రంలేవు.

ఇక డైరక్టర్లు అయితే మరీనూ. ఒక్క సినిమా రెండు సినిమాలు చేసిన డైరక్టర్లు తంబలు తంబలు వున్నారు. కానీ ఒక్కరికీ చేతిలో సినిమాలు లేవు. పెద్ద డైరక్టర్లు వినాయక్, శ్రీకాంత్ అడ్డాల, శ్రీనువైట్ల, ఇలా చాలా జాబితా వుంది. కానీ సినిమాలు లేవు.

నిర్మాతలు అంతా నాని, శర్వా, విజయ్ దేవరకొండ అంటున్నారు. అలాగే విన్నింగ్ డైరక్టర్ల కేసి చూస్తున్నారు. దాంతో సినిమాలు లిమిట్ అయిపోయాయి. చాన్స్ లు తగ్గిపోయాయి. ఈ లెక్కన చూస్తుంటే 2019లో చాలామంది హీరోలు, డైరక్టర్లు మాయం అయిపోయే పరిస్థితి కనిపిస్తోంది.

తలసానిని కలిస్తే సస్పెండా? మరి పరిటాల పెళ్ళిలో సెల్ఫీలు దిగారే

ఇండియన్ యూత్.. సెక్స్ కన్నా స్మార్ట్ ఫోనే ఇష్టం!