సంక్రాంతి బరిలో నిలిచిన వినయ విధేయరామ సినిమా మంచి వసూళ్లు సాధించింది. ఈ సినిమా వసూళ్లు 60 కోట్ల రూపాయలు దాటాయి. అయినప్పటికీ ఎవరికీ తృప్తిలేదు. దీనికి కారణం అందరికీ తెలిసిందే. ఓవైపు వసూళ్లు వస్తున్నప్పటికీ మరోవైపు సినిమాకు డిజాస్టర్ టాక్ రావడాన్ని యూనిట్ జీర్ణించుకోలేకపోతోంది. అందుకే 60 కోట్లు వచ్చినా ఎవరికీ తృప్తిలేదు.
సంక్రాంతి సీజన్ కావడంతో సినిమాకు లాభాలు రాకపోయినా నష్టాల ప్రభావం తగ్గింది. అయినప్పటికీ ఎంతోకొంత నష్టమే కాబట్టి బయ్యర్లు బాధల్లో ఉన్నారు. పోనీ సినిమాలో కథ బాగుందా అంటే అది కూడా లేదు. ఈ విషయంలో కూడా అసంతృప్తి తప్పలేదు. కనీసం యాక్టింగ్ పరంగానైనా చరణ్ లో కొత్తగా ఏదైనా యాంగిల్ కనిపించిందంటే అది కూడా లేదు.
ఇవన్నీ పక్కనపెడితే సినిమా ఫ్లాప్ అయినా కనీసం పాటలు హిట్ అయితే మ్యూజికల్ హిట్ అని వేసుకుందామంటే ఆ అవకాశం కూడా లేకుండా చేశాడు దేవిశ్రీ ప్రసాద్. ఇలా ఏ యాంగిల్ లో చూసుకున్నా వినయ విధేయ నిరాశపరిచింది.
అయితే ఓవైపు ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో తెగ హంగామా చేస్తున్నారు. సినిమా ఫ్లాప్ అనే విషయాన్ని నేరుగా అంగీకరించకుండా.. ఫ్లాప్ టాక్ తోనే మా చరణ్ బాబు అద్భుతమైన వసూళ్లు రాబడుతున్నాడంటూ కొత్త పల్లవి అందుకున్నారు.
అట్టర్ ఫ్లాప్ సినిమాకు 60 కోట్లు అంటే మామూలు విషయం కాదంటూ ట్రెండింగ్ షురూ చేశారు. కిందపడినా మాదే పైచేయి అంటే ఇదేనేమో.
తలసానిని కలిస్తే సస్పెండా? మరి పరిటాల పెళ్ళిలో సెల్ఫీలు దిగారే