ఇప్పుడు కాదు.. దాదాపు 3 వారాల కిందట్నుంచే రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలకు రంగం సిద్ధం చేసుకున్నారు మెగాభిమానులు. చెర్రీ పుట్టినరోజుకు సోషల్ మీడియాను హోరెత్తించాలని, దాదాపు అన్ని పట్టణాల్లో గ్రాండ్ గా సెలబ్రేషన్స్ చేయాలని అనుకున్నారు. వాళ్లందరి ఆశలపై నీళ్లుచల్లాడు చరణ్. దయచేసి తన పుట్టినరోజు వేడుకల్ని సెలబ్రేట్ చేయొద్దని కోరుతున్నాడు. దీనికి కారణం కరోనా.
“మనం ఉన్న ఈ అసాధారణ పరిస్థితులు మీకు తెలియనివి కావు. ఇలాంటి సందర్భాల్లో మనం సాధ్యమైనంత వరకు జనసాంద్రత తక్కువగా ఉండేట్టు చూస్కుంటూ ఉండడం మంచిది. ఇది మనసులో పెట్టుకొని ఈ ఏడాది నా పుట్టినరోజు వేడుకల్ని విరమించుకోవాల్సిందిగా మనవి.”
తన పుట్టినరోజు నాడు కేకులు కట్ చేసి సెలబ్రేట్ చేసుకునే బదులు.. అధికారులకు సహకరించి కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టే విధానాల్ని ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియజేయాలని కోరాడు. అదే తనకు అతిపెద్ద పుట్టినరోజు కానుక అంటున్నాడు చరణ్.
ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు చరణ్. అతడి పుట్టినరోజు నాడు ఈ సినిమా నుంచి చరణ్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయాలని అనుకున్నారు. ఇప్పుడు కరోనా కారణంగా ఫస్ట్ లుక్ రిలీజ్ ను కూడా వాయిదా వేస్తారేమో చూడాలి. ఎందుకంటే, ఫస్ట్ లుక్ రిలీజైనా రోడ్లపైన అభిమానుల హంగామా ఉంటుంది. కాబట్టి సమూహాలు ఏర్పడకుండా ఉండాలంటే ఫస్ట్ లుక్ రిలీజ్ ను వాయిదా వేయడమే మంచిది. మరి రాజమౌళి ఏం చేస్తాడో చూడాలి.
లేడీ పోలీస్ బాబీ రాణి వార్నింగ్
ద్యేవుడా…బట్టల్లేకుండా కనిపించడం స్టార్ హీరోయిన్‌కు సరదా అట