ప్రతియేటా టైమ్స్ వాళ్లు మోస్ట్ డిజైరబుల్ మెన్ అంటూ ఒక జాబితాను ప్రకటిస్తూ ఉంటారు. జాతీయ స్థాయిలో ఒక జాబితా, రాష్ట్రాల వారీగా మరో జాబితాను ప్రకటిస్తూ ఉంటుంది టైమ్స్. సినిమా, స్పోర్ట్స్, బిజినెస్ సెల్రబిటీలను ఈ జాబితాలో ఉంచుతారు. పేజ్ త్రీ పీపుల్ తో ఈ లిస్ట్ నిండి ఉంటుంది. ఈ ఏడాదికి సంబంధించి మరోసారి విజయ్ దేవరకొండ ఈ జాబితాలో టాప్ పొజిషన్లో నిలిచాడు. విశేషం ఏమిటంటే.. క్రితం ఏడాది కూడా ఇదే పొజిషన్ ను సొంతం చేసుకున్నాడు విజయ్ దేవరకొండ. వరసగా రెండో ఏడాది టైమ్స్ వాళ్ల మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో విజయ్ నిలిచాడు.
అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ జాతకం మారిపోయిన సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి విడుదల అయిన సంవత్సరంలో విజయ్ ఈ జాబితాలో రెండో స్థానంలో నిలిచాడు. ఆ తర్వాత మొదటి స్థానాన్ని చేరుకున్నాడు. ఈ సారి కూడా ఇతడికి అదే స్థానం ఇచ్చింది టైమ్స్.
ఈ మధ్యనే విజయ్ సినిమా 'వరల్డ్ ఫేమస్ లవర్' టార్గెటెడ్ ఆడియన్స్ ను కూడా రీచ్ కాలేకపోయింది. అయినప్పటికీ విజయ్ క్రేజ్ కొనసాగుతోందని టైమ్స్ ఈ జాబితా ద్వారా చెబుతోంది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా 'లైగర్' సినిమా రూపొందుతూ ఉంది. ఈ సినిమా విజయ్ తదుపరి కెరీర్ కు అత్యంత కీలకం అని చెప్పవచ్చు.
లేడీ పోలీస్ బాబీ రాణి వార్నింగ్
ద్యేవుడా…బట్టల్లేకుండా కనిపించడం స్టార్ హీరోయిన్‌కు సరదా అట!