ఇతడ్ని చూశారుగా.. ఇతగాడి పేరు సెంతమీజ్. అది కూడా ఇతడి అసలైన పేరని చెప్పలేం. సోషల్ మీడియాలో ఆ పేరు పెట్టుకొని చలామణి అవుతున్నాడు. ఇంతకీ మేటర్ ఏంటంటే.. ఇతడి దగ్గర హీరోయిన్ నమితకు చెందిన పోర్న్ వీడియోస్ ఉన్నాయట. ఆ విషయాన్ని చెబుతోంది ఎవరో కాదు. స్వయంగా నమితానే ఈ విషయం చెప్పుకొచ్చింది.
తన పోర్న్ వీడియోస్ ఉన్నాయని, లీక్ చేస్తానని ఈ వ్యక్తి తనను బెదిరిస్తున్నాడని ఆరోపిస్తోంది నమిత. ఈ మేరకు సదరు వ్యక్తి ఫొటోను సోషల్ మీడియాలో పెట్టింది. ముందుగా తనకు డైరక్ట్ మెసేజ్ పెట్టి పరిచయం చేసుకున్నాడని, తర్వాత తనను ఏకంగా “ఐటెం” అని పిలవడం ప్రారంభించాడని చెప్పుకొచ్చింది నమిత.
అతడి ప్రవర్తనపై అసహనం వ్యక్తంచేయగా.. తన పోర్న్ వీడియోలు ఉన్నాయని, వాటిని బయటపెడతానంటూ బెదిరించాడంటూ చెప్పుకొచ్చింది. వాస్తవమేంటో తనకు తెలుసని, తన క్యారెక్టర్ ఏంటో తనకు తెలుసని, అందుకే అలాంటి వీడియోస్ ఏమైనా ఉంటే పబ్లిక్ లో పెట్టుకోమని ధైర్యంగా అతడికి చెప్పానంటోంది నమిత.
ఈ చీప్ మెంటాలిటీ కలిగిన వ్యక్తికి అంతా దూరంగా ఉండాలంటూ పిలుపునిస్తోంది నమిత. తన క్యారెక్టర్ గురించి తనతో పాటు చాలామందికి తెలుసని, ఇలాంటి చీప్ ట్రిక్స్ కు పడనని చెబుతోంది. ఇన్నాళ్లూ సైలెంట్ గా ఉన్నానని, దాన్ని బలహీనతగా అనుకుంటే మాత్రం పొరపాటంటూ సుదీర్ఘంగా రాసుకొచ్చింది.
నవరాత్రుల్లో దుర్గాదేవిని పూజించడం, ఉమెన్స్ డే రోజున మహిళల గురించి పొగడ్డం కంటే, నిజజీవితంలో ప్రతి రోజూ మహిళకు గౌరవం ఇచ్చినప్పుడే అసలైన గుర్తింపు వస్తుందని చెబుతోంది. ఇన్ని విషయాలు చెప్పిన నమిత, సదరు వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేసిందా లేదా అనే విషయాన్ని మాత్రం బయటపెట్టలేదు.
లేడీ పోలీస్ బాబీ రాణి వార్నింగ్
ద్యేవుడా…బట్టల్లేకుండా కనిపించడం స్టార్ హీరోయిన్‌కు సరదా అట!